Padi Kaushik Reddy: భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు !
భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు !
Padi Kaushik Reddy: భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అంతుచూస్తానని బెదిరించారంటూ సైబరాబాద్ అదనపు డీసీపీ రవిచందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అంతుచూస్తానని బెదిరించారంటూ సైబరాబాద్ అదనపు డీసీపీ రవిచందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై 132, 351 (3) బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Padi Kaushik Reddy Comment
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy) మధ్య గురువారం మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. కౌశిక్‌రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి, ఇతర భారాస నేతలు ఎమ్మెల్యే గాంధీపై ఫిర్యాదు చేసేందుకు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో తీవ్రమైన తోపులాట జరిగింది. భారాస నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అదనపు డీసీపీ రవిచందన్‌తో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను తోసేశారు. ఈ నేపథ్యంలో డీసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ నివాసంలో పార్టీ నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు భారాస ప్రకటించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు ఇంటి నుంచి ర్యాలీగా బయల్దేరతామని నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు