Pahalgam Terror Attack: పాకిస్తాన్ లో జరిగిన ర్యాలీలో ‘పహల్గాం ఉగ్రదాడి’ సూత్రధారి
పాకిస్తాన్ లో జరిగిన ర్యాలీలో ‘పహల్గాం ఉగ్రదాడి’ సూత్రధారి
Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గాంలో పర్యాటకులపై ఉగ్రమూకలు చేసిన దాడుల్లో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసింది. దీనితో పహాల్గాం ఉగ్రదాడికి(Pahalgam Terror Attack) ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి… పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే పహల్గాం దాడి వెనుక కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న ఉగ్ర సంస్థ లష్కరే తాయిబా కమాండర్ సైఫుల్లా కసూరీ మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు. దీనితో భారత్ ప్రభుత్వం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో ఎక్కడో ఆశ్రయం పొందుతున్నాడని అనుకున్నారు. అయితే సైఫుల్లా కసూరీ మాత్రం ఒక్కసారిగా బహిరంగ వేదికపై కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
పహల్గాం దాడి(Pahalgam Terror Attack) వెనుక కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న ఉగ్ర సంస్థ లష్కరే తాయిబా కమాండర్ సైఫుల్లా కసూరీ మరోసారి బహిరంగ వేదికపై కనిపించాడు. అది కూడా పాకిస్థాన్ రాజకీయ నేతలు, పలువురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు పాల్గొన్న ఒక ర్యాలీలో వారితో కలిసి వేదిక పంచుకున్నాడు. పాక్ అణుపరీక్షల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వీరంతా ఒక్కచోట చేరారు. ఈ సందర్భంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ర్యాలీల్లో పాల్గొన్న వాళ్లలో లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, భారత్ ఉగ్రవాదిగా ముద్ర వేసిన తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు.
Pahalgam Terror Attack – పాక్ కు గూడచర్యం అనుమానంపై రాజస్థాన్ ప్రభుత్వోద్యోగి అరెస్ట్
పాక్ గుడాచార సంస్థ ఐఎ్‌సఐకి దేశ రహస్యాలు చేరవేస్తున్నాడన్న అనుమానంపై రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగి సకూర్‌ఖాన్ మంగళియార్‌ను సీఐడీ పోలీసుల బృందం బుధవారం అరెస్ట్ చేసింది. జైసల్మేర్‌లోని ఆయన ఆఫీసులోనే సకూర్‌ఖాన్ మంగళియార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు… తదుపరి విచారణకు జైపూర్‌కు తరలించనున్నారు. అతడికి కాంగ్రెస్ నేతలతో సంబంధం ఉందని, గత ప్రభుత్వంలో ఆ పార్టీ నేతకు సహాయకుడిగా పని చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ సరిహద్దు గ్రామ వాసి సకూర్‌ఖాన్ ఫోన్లో పలువురు పాక్ పౌరుల ఫోన్ నంబర్లున్నాయి. తమ ప్రశ్నలకు సరైన జవాబులివ్వడం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
Also Read : Air Chief Marshal: ఆయుధాలు, ఆయుధ వ్యవస్థపై ఎయిర్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు