Mohammad Zahoor : ఉక్రెయిన్ కు పాక్ బిలియనీర్ సపోర్ట్
రెండు ఫైటర్ జెట్ల కొనుగోలుకు సహాయం
Mohammad Zahoor : రష్యా తన యుద్దాన్ని ఉక్రెయిన్ పై ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఓ వైపు యావత్ ప్రపంచం నెత్తీ నోరు బాదుకున్నా పట్టించు కోవడం లేదు. తన మానాన తాను బాంబులు, మిస్సైళ్లతో విరుచుకు పడుతోంది.
ఇంకో వైపు చివరి క్షణం వరకు తాము నిష్క్రమించే ప్రసక్తి లేదంటున్నారు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ. ఈ తరుణంలో ప్రపంచాన్ని విస్మయ పరిచేలా పాకిస్తాన్ కు చెందిన బిలియనీర్ మహ్మద్ జహూర్(Mohammad Zahoor) ఉక్రెయిన్ కు యుద్ద సమయంలో ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు సహాయం చేశాడు.
ఈ విషయాన్ని కైవ్ పోస్ట్ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. ఈ పత్రికకు మాజీ యజమానిగా ఉన్నారు జహూర్. యుద్దం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ పౌరులను సురక్షితంగా తరలించేందుకు కృషి చేస్తున్నారు.
ఓ వైపు రష్యా దళాలు విరుచుకు పడుతున్న తరుణంలో ఉక్రెయిన్ వైమానిక దళం కోసం రెండు జెట్ లను కొనుగోలు చేయడంలో సహాయం చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా జహూర్ భార్య ఉక్రేనియన్ గాయని కమాలియా జహూర్. తన భర్త ఇతర సంపన్న స్నేహితులు రష్యాపై పోరాడేందుకు గాను ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్నారంటూ కమాలియా జహూర్.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. జహూర్ పాకిస్తాన్ లో పుట్టిన బ్రిటిష్ వ్యాపారవేత్త. నిధులు సమీకరించేందుకు, శరణార్థులను తరలించేందుకు కృషి చేస్తున్నారు.
ఉక్రెయిన్ కు ప్రయాణం చేసేందుకు దేశాధినేతలు, ఇతర ప్రభావంతమైన వ్యక్తులతో సమావేశం కొనసాగించేలా జహూర్ ప్రయత్నం చేశాడని సమాచారం.
Also Read : అమ్మకానికి శ్రీలంక ఎయిర్ పోర్ట్ సిద్దం