Imran Khan : ప్ర‌మాదంలో పాకిస్తాన్ – ఇమ్రాన్ ఖాన్

దేశం మునిగి పోతోంద‌ని ఆవేద‌న

Imran Khan : పాకిస్తాన్ ప్ర‌మాదంలో ప‌డింద‌ని, దాని భ‌విష్య‌త్తు అగ‌మ్య గోచ‌రంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆ దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి, మాజీ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. దేశంలో దొంగ‌లు ప‌డ్డార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అస్త‌వ్య‌వ‌స్థ పాల‌న‌, అసంబద్ద నిర్ణ‌యాల వ‌ల్ల ఆర్థిక సంక్షోభం మ‌రింత తీవ్రంగా మారింద‌న్నారు.

అందుకే వెంట‌నే దేశంలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌కు స్వేచ్ఛాయుత‌మైన , నిష్ప‌క్ష పాత‌మైన ఎన్నిక‌లే ప‌రిష్కారం అని పేర్కొన్నారు. ఓడి పోతామ‌న్న భ‌యంతో కొత్తగా కొలువు తీరిన షెహ‌బాజ్ స‌ర్కార్ భ‌యాందోళ‌న‌కు గుర‌వుతోంద‌ని ఎద్దేవా చేశారు ఇమ్రాన్ ఖాన్.

పంజాబ్ , ఖైబ‌ర్ ఫ‌క్తున్ ఖ్వా లోని ప్ర‌భుత్వాల‌ను ర‌ద్దు చేయ‌నున్నాయ‌ని ప్ర‌క‌టించ‌డంతో దేశం మునిగి పోతోందంటూ కామెంట్స చేశారు మాజీ ప్ర‌ధాన‌మంత్రి. తాము రెండు అసెంబ్లీల‌ను ర‌ద్దు చేశాక‌, ప్రావిన్సుల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. త‌మ పార్టీకి చెందిన స‌భ్యుల రాజీనామాలు ఇంత వ‌ర‌కు ఆమోదించ బ‌డ‌లేద‌న్నారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).

వారి రాజీనామాల‌ను ఆమోదించాలంటూ స్పీక‌ర్ ను కోరుతామ‌న్నారు మాజీ ప్ర‌ధాన‌మంత్రి. ఈ దేశం బాగు ప‌డేందుకు అవ‌కాశాలు ఉన్నా కావాల‌ని త‌నను ఉద్దేశ పూర్వ‌కంగా తొల‌గించార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు త‌మ‌కు మ‌ళ్లీ ప‌ట్టం క‌ట్టేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెప్పారు ఇమ్రాన్ ఖాన్.

ప్ర‌భుత్వానికి ఎన్నిక‌ల ద్వారా గుణ‌పాఠం చెప్పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ దొంగ‌ల పేర్లు శాశ్వ‌తంగా తుడిచి పెట్టుకు పోయేంత ఓట‌మిని ఎదుర్కోవాల‌న్నారు. తాజాగా మాజీ పీఎం చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : భారత్ తో అణు యుద్ధానికి సిద్దం – షాజియా

Leave A Reply

Your Email Id will not be published!