Pakistan Peace Delegation: భారత్‌ ను కాపీ కొడుతున్న పాక్ ! భారత్ తరహాలో పీస్ డెలిగేషన్ టీం ఏర్పాటు !

భారత్‌ ను కాపీ కొడుతున్న పాక్ ! భారత్ తరహాలో పీస్ డెలిగేషన్ టీం ఏర్పాటు !

 

 

పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదుల స్థావరాలను నేటమట్టం చేయడంతో పాటు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ నిజ స్వరూపం బయటపెట్టేందుకు భారత్ ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడు అఖిలపక్ష బృందాలను ఎంపిక చేసిన దేశాలు పంపించి వారికి పాకిస్తాన్ యొక్క ఉగ్రదాడిని వివరించడం ద్వారా దాని నిజస్వరూపం బయటపెట్టడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఆ ఏడు బృందాలను నియమించడంతో పాటు… వారు వెళ్లాల్సిన దేశాలను కూడా ప్రకటించడం జరిగింది.

 

అయితే పాకిస్తాన్ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ప్రతీ విషయంలో భారత్‌ కు పోటీ రావాలని చూస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదానికి సపోర్టు చేస్తూ ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్… సిగ్గు లేకుండా శాంతి ప్రచారానికి సిద్ధమైంది. భారత ప్రతినిధుల బృందం… పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేయడంపై… ఉగ్రవాదంపై భారత్ విధానాలను ప్రచారం చేయడానికి వెళుతుంటే… పాకిస్తాన్ మాత్రం… తగుదునమ్మా అంటూ తాము శాంతికి పెద్ద పీట వేశామని చెప్పడానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయంపై మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీని పిలిపించారు. పాకిస్తాన్ శాంతి కోసం పరితపిస్తోందంటూ ప్రపంచ దేశాలకు వివరించాలని బుట్టోకు చెప్పారు.

 

ఇదే విషయాన్ని బుట్టో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నన్ను పిలిపించారు. పాక్ శాంతి కోసం పరితపిస్తున్న విధానాన్ని అంతర్జాతీయ వేదికలపై వివరించాలని చెప్పారు. ఆ బాధ్యతను తీసుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను’ అని అన్నారు.

 

అఖిలపక్షం బృందాల పర్యటించబోయే దేశాలు ప్రకటించిన కేంద్రం

 

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. శశిథరూర్‌ (కాంగ్రెస్‌), రవిశంకర్‌ ప్రసాద్‌ (బీజేపీ), బైజయంత్‌ పాండా (బీజేపీ), సంజయ్‌కుమార్‌ ఝా (జేడీ-యూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలె (ఎన్సీపీ-ఎస్పీ), శ్రీకాంత్‌ శిందే (శివసేన)లు ఈ బృందాలకు నేతృత్వం వహిస్తారు. దేశం తరఫున జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రపంచ యవనికపై చాటడం ఉద్దేశంగా ఐరాస భద్రతా మండలిలోని దేశాలకూ ఈ బృందాలు వెళ్లనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఏయే బృందాలు.. ఏయే దేశాలకు వెళ్తాయనే జాబితాను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తాజాగా వెల్లడించారు.

 

బైజయంత్‌ పాండా నేతృత్వంలోని బృందం: సౌదీఅరేబియా, కువైట్‌, బహ్రెయిన్‌, అల్జీరియా
రవిశంకర్‌ ప్రసాద్‌ బృందం: యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్‌
సంజయ్‌కుమార్‌ ఝా బృందం: ఇండోనేసియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, జపాన్‌, సింగపూర్‌
శ్రీకాంత్‌ శిందే బృందం: యూఏఈ, లైబీరియా, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, సియెర్రా లియోన్‌
శశిథరూర్‌ బృందం: యూఎస్‌, పనామా, గయానా, బ్రెజిల్‌, కొలంబియా
కనిమొళి బృందం: స్పెయిన్‌, గ్రీస్‌, స్లోవేనియా, లాట్వియా, రష్యా
సుప్రియా సూలె బృందం: ఈజిప్ట్‌, ఖతార్‌, ఇథియోపియా, దక్షిణాఫ్రికా

 

Leave A Reply

Your Email Id will not be published!