Pakistan PM: యుద్ధంపై పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ! మేమే గెలిచాం అంటూ తప్పుడు కూతలు !

యుద్ధంపై పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ! మేమే గెలిచాం అంటూ తప్పుడు కూతలు !

Pakistan PM : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాకిస్తాన్ కకావికలమయిన సంగతి తెలిసిందే. భారత్ చేసిన క్షిపణి దాడుల్లో వందల సంఖ్యలో ఉగ్రవాదులను కోల్పోవడమే కాకుండా… ఇతర ప్రపంచ దేశాల నుండి పాకిస్తాన్(Pakistan) కు మద్దత్తు కరువయింది. మరోవైపు పాకిస్తాన్ డ్రోన్ల దాడిని… భారత్ సైన్యం సమర్ధవంతంగా త్రిప్పికొడుతుంది. దీనితో కాల్పుల విమరణకు అగ్రరాజ్యం అమెరికాతో మధ్య వర్తిత్వం నడిపింది. అమెరికా మధ్యవర్తిత్వం కాస్తా ఫలించడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. శనివారం సాయంత్రి 5 గంటల నుండి త్రివిధ దళాలు దాడులను ఆపేశాయి.

Pakistan PM Viral Comments

అయితే యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయినా… కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా… తన వక్ర బుద్ధి మాత్రం మారలేదు. శనివారం యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహ్‌బాజ్ షరీఫ్(Pakistan PM) జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నమ్మశక్యం కానీ, నిజం లేని గొప్పలు చెప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ శత్రువుల ఏయిర్ బేస్‌లు, స్థావరాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశాము. వారి రాఫెల్ యుద్ధ విమానాల్ని నేల కూల్చాం. ఈ యుద్ధంలో మేమే విజయం సాధించాము. ఇది పాకిస్తానీల విజయం. పాకిస్తానీ ఆర్మీ , చైనా, టర్కీ, ఇతర ముస్లిం దేశాలకు మా కృతజ్ణతలు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నా ధన్యవాదాలు’ అని అన్నారు.

యుద్ధం ముగిసిన తర్వాత భారత్ మౌనంగా ఉంటే… చావు దెబ్బలు తిన్న పాక్ మాత్రం తామే గెలిచామంటూ ప్రచారం చేసుకుంటోంది. పాక్ ప్రధాని వ్యాఖ్యల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న ఇండియన్ నెటిజన్లు కొందరు ఆయనపై సీరియస్ అవుతుంటే … మరికొందరు నవ్వుకుంటున్నారు.

పాక్‌ సైన్యాధికారి తండ్రి లాడెన్‌ సన్నిహితుడు

పాకిస్థాన్‌(Pakistan) సైన్యాధికారి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌధరి తండ్రి సుల్తాన్‌ బషీరుద్దీన్‌ మహమూద్‌ ఐక్యరాజ్యసమితి ఆంక్షలకు గురైన అణు శాస్త్రవేత్త. ఆయన అల్‌ ఖైదాకు అణ్వస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారని అమెరికా కూడా ఆంక్షలు విధించింది. మహమూద్‌ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను కలుసుకున్నందుకు 2001లో అరెస్టయ్యారు. అణు సాంకేతికతను బదిలీ చేసే నైపుణ్యం ఆయనకు లేదంటూ అధికారులు తరవాత విడిచిపెట్టారు. అమృత్‌సర్‌ లో పుట్టి పాకిస్థాన్‌కు వలస వెళ్లిన మహమూద్‌ ప్రస్తుతం 85 ఏళ్ల వయసులో ఇస్లామాబాద్‌లో నివసిస్తున్నారు. అమెరికా ఆర్థికశాఖ నిషిద్ధ వ్యక్తుల జాబితాలో ఈయన పేరు ఉంది. పాకిస్థాన్‌ అణుశక్తి కమిషనులో ఉద్యోగ విరమణ చేసిన మహమూద్‌ ఇస్లామిక్‌ దృక్కోణం నుంచి విశ్వం ఎలా అంతమవుతుందో వివరిస్తూ ‘మెకానిక్స్‌ ఆఫ్‌ డూమ్స్‌ డే అండ్‌ లైఫ్‌ ఆఫ్టర్‌ డెత్‌’ అనే పుస్తకాన్ని రచించారు. ఇప్పుడు తన కుమారుడైన త్రీస్టార్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ చౌధరి భారత్‌ – పాక్‌ తాజా సంఘర్షణ గురించి పాత్రికేయులకు తెలిపే బాధ్యత తీసుకున్నారు.

Also Read : Rajasthan: పాక్‌ తో పోరు వేళ రాజస్థాన్ లో బ్లాక్‌ అవుట్‌ ! మొబైల్‌ టార్చి వెలుగులో పెళ్లి !

Leave A Reply

Your Email Id will not be published!