Palla Rajeswar Reddy : ముత్తిరెడ్డికి షాక్ పల్లాకు ఛాన్స్
ఐటీ మంత్రి కేటీఆర్ మంత్రాంగం
Palla Rajeswar Reddy : ఎట్టకేలకు తనకు ఎదురే లేదని చాటుకున్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. పల్లా వర్సెస్ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు నానా తంటాలు పడ్డారు. ప్రగతి భవన్ మెట్లు ఎక్కారు. ఇద్దరి నేతల అనుచరులు బల ప్రదర్శన చేసేంత వరకు వెళ్లింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Palla Rajeswar Reddy Got a Chance
తీవ్ర అసంతృప్తితో ఉన్న ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డికి ఊహించని రీతిలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇక అసంతృప్తి వ్యక్తం చేసిన వారికి పదవులతో మాట్లాడకుండా చేశారు. ముత్తిరెడ్డితో పాటు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతు బంధు చైర్మన్ పదవిని ఇచ్చారు.
దీంతో నిన్నటి దాకా నోరు పారేసుకున్న ముత్తిరెడ్డి, రాజయ్యలు మౌనంగా ఉండి పోయారు. ప్రస్తుతం వీరితో పాటు కర్నె ప్రభాకర్ ప్రగతి భవన్ కే పరిమితం కావడం విశేషం. ఇదిలా ఉండగా టికెట్ ఆశిస్తూ వచ్చిన ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో(Palla Rajeswar Reddy ) స్వయంగా మాట్లాడారు మంత్రి కేటీఆర్.
ముత్తిరెడ్డికి షాక్ ఇచ్చారు కేటీఆర్. జనగాం ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ముత్తిరెడ్డి సైలెంట్ అయి పోయారు.
Also Read : Dokka Manikya Vara Prasad : 26 నుంచి బస్సు యాత్ర
