Pankaja Munde : మంత్రివ‌ర్గంపై పంకంజ ముండే కామెంట్స్

త‌న‌కు మంత్రిన‌య్యే అర్హ‌త లేద‌మో

Pankaja Munde : 42 రోజుల త‌ర్వాత కొత్త‌గా కొలువు తీరిన షిండే, బీజేపీ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించింది. శిండే వ‌ర్గం, ఫ‌డ్న‌వీస్ వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేల‌కు చాన్స్ ద‌క్కింది.

ఈ లిస్టును బీజేపీ హై క‌మాండ్ ఫైనల్ చేసింది. ఈ సంద‌ర్భంగా మ‌హారాష్ట్ర కేబినెట్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన పంకజ ముండే. బీజేపీ నుండి 9 మందికి కేబినెట్ లో చోటు ద‌క్కింది.

ఇప్ప‌టికే ఫ‌డ్న‌వీస్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దీనిని కాషాయ పార్టీ నేత‌లు జీర్ణించుకోలేక పోయారు. విచిత్రం ఏమిటంటే ఏక్ నాథ్ షిండే సీఎంగా ఉన్న‌ప్ప‌టికీ మొత్తం చ‌క్రం తిప్పుతున్న‌ది మాత్రం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ అనే ప్ర‌చారం ఉంది.

ఇదిలా కొత్తగా కొలువు తీరిన మ‌రాఠా కేబినెట్ లో ఒక్క మ‌హిళ‌కు కూడా బెర్త్ ద‌క్క‌క పోవ‌డం విస్తు పోయేలా చేసింది. మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని చెప్పే బీజేపీ ఎందుక‌ని చాన్స్ ఇవ్వ‌లేద‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ త‌రుణంలో పంక‌జ ముండే(Pankaja Munde) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మ‌రాఠా భార‌తీయ జ‌న‌తా పార్టీలో. ఈ పంక‌జ ముండే ఎవ‌రో కాదు దివంగ‌త బీజేపీ అగ్ర నాయ‌కుడిగా పేరొందిన గోపీనాథ్ ముండే కూతురు.

మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో జ‌వాబు ఇచ్చారు. మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌క పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.

ఒక‌టి మ‌హిళ కావ‌డం. రెండు మంత్రి అయ్యేందుకు కావాల్సిన అర్హ‌త‌లు లేక పోవ‌డం ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్య‌లు నేరుగా బీజేపీ చీఫ్ ఫ‌డ్న‌వీస్ ను తాక‌డం విశేషం.

Also Read : కాశ్మీర్ లో వ‌ల‌స కూలీ కాల్చివేత‌

Leave A Reply

Your Email Id will not be published!