Papal Preet Singh : దిబ్రూఘర్ జైలుకు పాపల్ ప్రీత్ సింగ్
అమృతపాల్ సింగ్ కు మెంటార్
Papal Preet Singh : ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు, భింద్రన్ వాలే -2 గా పేరు పొందిన అమృతపాల్ సింగ్ కు బిగ్ షాక్ తగిలింది. అతడి అనుచరుడిగా, మెంటర్ గా పేరొందిన పాపల్ ప్రీత్ సింగ్ ను(Papal Preet Singh) పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అస్సాంలోని దిబ్రూఘర్ జైలుకు తరలించారు. మార్చి 18న అమృత పాల్ సింగ్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు.
అతడి మిస్సింగ్ వెనుక పాపల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. పంజాబ్ పోలీసులతో పాటు ఢిల్లీ స్పెషల్ టీమ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. అమృత్ సర్ రూరల్ జిల్లా కతుసంగల్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు పాపల్ ప్రీత్ సింగ్ ను. విమానంలో తరలించడం విశేషం. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీందర్ సింగ్ దీనిని ధ్రువీకరించారు.
అమృత్ సర్ ఎయిప్ పోర్ట్ వెలుపల తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు పాపల్ ప్రీత్ సింగ్ మీడియాతో. సింగ్ కు 42 ఏళ్లు. 2022లో దుబాయ్ నుండి పంజాబ్ కు తిరిగి వచ్చాడు. రాడికల్ సిక్కు నాయకుడితో కలిసి పని చేస్తున్నాడు.
పోలీసుల దర్యాప్తులో అమృతపాల్ సింగ్ , పాపల్ ప్రీత్ సింగ్ కలిసి ఉన్నట్లు అనేక ఫోటోలు గుర్తించారు. ఇదే సమయంలో తాను పారి పోలేదని త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తానని ఓ వీడియో సందేశంలో ప్రకటించాడు అమృత పాల్ సింగ్.
Also Read : మాజీ ఆర్మీ చీఫ్ వల్లే పదవి కోల్పోయా