Justin Biber : పక్షవాతానికి గురైన స్టార్ సింగర్ బీబర్
ముఖానికి పక్షవాతం వచ్చిందని ప్రకటన
Justin Biber : కోట్లాది అభిమానులను కలిగిన ఏకైక గాయకుడు జస్టిన్ బీబర్ పాడలేని స్థితిలో ఉన్నాడు. అవునని అంటున్నాడు ఈ దిగ్గజ సింగర్. అతడు త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా కోరుతున్నారు. దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.
తన ముఖానికి పక్షవాతం వచ్చిందని చెప్పాడు. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. త్వరలో తాను కోలుకుంటానని, అంత వరకు ఓపిక పట్టాలని తనను అభిమానించే వారికి విన్నవించాడు.
మీరు నన్ను గమనిస్తే తాను కన్ను రెప్ప వేయలేనని, ముఖం ఇటు వైపు పెట్టి నవ్వలేనని తెలిపాడు. ఈ ముక్కు రంద్రం కూడా కదలడం లేదని వాపోయాడు జస్టిన్ బీబర్(Justin Biber).
శరీరం నన్ను నెమ్మదించమని చెబుతోందంటూ స్పష్టం చేశాడు సింగర్. మొత్తంగా తనకు ముఖ పక్షపాతం సోకిందని పేర్కొన్నాడు బీబర్. అందుకనే తాను అనారోగ్యం కారణంగా వరల్డ్ టూర్ ను వాయిదా వేసినట్లు స్పష్టం చేశాడు.
ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో హల్ చల్ చేసింది. రామ్ సే హంట్ సిండ్రోమ్ తో బాధ పడుతున్నట్లు తెలిపాడు. తాను ఈ వ్యాధితో బాధ పడుతున్నట్లు పేర్కొన్నాడు.
జస్టిన్ బీబర్ కు 28 ఏళ్లు ఉన్నాయి. పాప్ గాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరొందాడు. కాగా టొరంటోలో తన మొదటి కచేరి నిర్వహించే గంట ముందు ప్రకటించాడు బీబర్(Justin Biber).
రామ్ సే హంట్ సిండ్రోమ్ అనేది షింగిల్స్ సంక్లిష్టత. ఇది చెవికి సమీపంలో ఉన్న ముఖ నాడిని వ్యాప్తి చేసినప్పుడు ఏర్పడుతుంది. ముఖ పక్షపాతంతో పాటు వినికిడి లోపం కలుగుతుంది.
Also Read : సోనూ సూద్ సాయం ఆపరేషన్ విజయవంతం