Parvathaneni Harish: ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం !

ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం !

Parvathaneni Harish: న్యూయార్క్‌ లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న రుచిరా కాంబోజ్ జూన్‌ లో రిటైరయ్యారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ పదవిలో హరీశ్ పర్వతనేని(Parvathaneni Harish) నియామకం అనివార్యమైందని స్పష్టం చేసింది. మరికొద్ది రోజుల్లో ఆయన తన పదవి బాధ్యతలు చేపడతారని వివరించింది.

Parvathaneni Harish – ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారీగా ఉన్న హరీశ్

ప్రస్తుతం హరీశ్ పర్వతనేని జర్మనీలో భారత రాయబారీగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. 1990, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి హరీశ్ పర్వతనేని(Parvathaneni Harish). 2021, నవంబర్ 6న జర్మనీలో భారత రాయబారీగా ఆయన నియమితులయ్యారు. అంతకుముందు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆర్థిక సంబంధాల విభాగంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహించారు. గత మూడు దశాబ్దాల పాటు పలు ద్వైపాక్షిక ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. అలాగే జీ 20, జీ 7, బ్రిక్స్, ఐబీఎస్ఏ‌లో సైతం ఆయన ముఖ్య భూమిక పోషించారు. తూర్పు ఆసియాతోపాటు విదేశీ ప్రచార విభాగాల్లో కూడా పని చేశారు.

భారత ఉప రాష్ట్రపతికి ఓఎస్‌డీగా, సంయుక్త కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయంలో సైతం ఆయన వివిధ హోదాల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌ విభాగంగా హరీశ్ పర్వతనేని గోల్డ్ మెడల్ అందుకున్నారు. అనంతరం కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. పర్వతనేని నందితను హరీశ్ వివాహం చేసుకున్నారు.

యూఎన్‌లో తొలి భారతీయురాలిగా రుచిర కాంబోజ్ !

యునైటెడ్ నేషన్స్‌లో భారత శాశ్వత ప్రతినిధిగా పని చేసిన రుచిర కాంబోజ్.. ఈ ఏడాది జూన్ 1వ తేదీన రిటైరయ్యారు. ఆ పదవిని చేపట్టిన తొలి భారతీయురాలిగా ఆమె ఖ్యాతిని ఆర్జించారు. 1987లో సివిల్స్‌లో టాపర్‌గా రుచిర కాంబోజ్ నిలిచారు. ఉద్యోగ పదవి విరమణ వేళ… ఎక్స్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.

Also Read : Rahul Navin: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొత్త డైరెక్టర్‌ గా రాహుల్ నవీన్ !

Leave A Reply

Your Email Id will not be published!