Spice Jet: ఫ్లైట్ టాయిలెట్‌లో చిక్కుకున్న ప్రయాణికుడు !

ఫ్లైట్ టాయిలెట్‌లో చిక్కుకున్న ప్రయాణికుడు !

Spice Jet: ముంబై నుండి బెంగుళూరు వెళ్ళే స్పైస్‌ జెట్‌ విమానంలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురయింది. ఫ్లైట్ టేకాఫ్ అవగానే టాయిలెట్ కు వెళ్ళిన ప్రయాణికుడు… డోర్ లాక్ పడటంతో అందులోని చిక్కుకుపోయాడు. తలుపును తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనితో టాయిలెట్ లో నుండి కేకలు వేయడంతో… విమాన సిబ్బంది కూడా ప్రయత్నించినా టాయిలెట్ తలుపు తెరచుకోలేదు. దీనితో సుమారు 100 నిమిషాల పాటు ఆ ప్రయాణికుడు టాయిలెట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

Spice Jet Toilet Issue

చివరకు ఆ విమానం బెంగుళూరులో ల్యాండ్ అయిన తరువాత ఇంజనీర్లు వచ్చి తలుపు పగలగొట్టి ప్రయాణికుడిని రక్షించారు. అనంతరం అతనికి ప్రథమ చికిత్స అందించి సురక్షితంగా ఇంటికి పంపించారు. ఈ ఘటన ముంబై నుంచి బెంగళూరు వెళ్ళే SG268 స్పైస్‌జెట్‌(Spice Jet) విమానంలో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. స్పైస్ జెట్ లాంటి ప్రైవేటు ఎయిర్ లైన్స్ లో కూడా టాయిలెట్స్ లో కూడా సాంకేతిక లోపాలు తలెత్తుతాయా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే ఫ్లైట్ కంటే ట్రైన్ బెస్ట్ ఏమో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన స్పైస్‌ జెట్‌ యాజమాన్యం… ‘‘డోర్‌ లాక్‌లో లోపం కారణంగా అతడు చాలా సేపు టాయిలెట్‌లోనే ఉన్నాడు. సిబ్బంది ప్రయాణికుడికి అన్ని విధాలుగా సహకరించారు. అతడిని బయటకు తీసుకొచ్చిన వెంటనే వైద్య సహాయం అందించాం’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read : Governor Tamilisai Soundararajan: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం !

Leave A Reply

Your Email Id will not be published!