Pastor Praveen Kumar: పాస్టర్‌ ప్రవీణ్‌ ది సెల్ఫ్ రోడ్‌ యాక్సిడెంట్‌ ! స్పష్టం చేసిన ఏలూరు డీఐజీ !

పాస్టర్‌ ప్రవీణ్‌ ది సెల్ఫ్ రోడ్‌ యాక్సిడెంట్‌ ! స్పష్టం చేసిన ఏలూరు డీఐజీ !

Pastor Praveen Kumar : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌ స్టాప్‌ పెట్టారు. మద్యం మత్తులో బైక్‌ నడిపి… సెల్ఫ్ యాక్సిడెంట్ జరగడం వలనే ప్రవీణ్‌ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేసారు. ఈ మేరకు పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.

Pastor Praveen Kumar Death Update

ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ… ‘‘హైదరాబాద్‌ నుంచి పాస్టర్‌ ప్రవీణ్(Pastor Praveen Kumar) బైక్‌ మీద బయల్దేరారు. అరోజు ప్రవీణ్‌ కుమార్‌ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్‌ ప్రవీణ్‌ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్‌ కొనుగోలు చేశారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్‌ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్‌ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్‌ ప్రవీణ్ ‌కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్‌ కుటుంబసభ్యులు చెప్పారు. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్‌ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.

పాస్టర్ ప్రవీణ్‌ హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్లారు. దారిలో ఆయనకు 3 సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. ప్రవీణ్‌ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక చెప్పింది. కీసర టోల్‌ ప్లాజా వద్ద ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. సాయం చేసేందుకు అంబులెన్స్‌, వైద్య సిబ్బంది వెళ్లారు. రామవరప్పాడు జంక్షన్‌ వద్ద ప్రవీణ్‌ పరిస్థితిని ఆటో డ్రైవర్‌ చూశారు. ట్రాఫిక్‌ ఎస్సై సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారు. కండిషన్‌ బాగోలేదు, వెళ్లవద్దని చెప్పినా ఆయన వినలేదు. హెడ్‌లైట్‌ పగిలిపోవడంతో రైట్‌సైడ్‌ బ్లింకర్‌ వేసుకునే ప్రయాణించారు.

ఏలూరులో(Eluru) ఆయన మద్యం కొనుగోలు చేశారు. మద్యం దుకాణానికి వచ్చినప్పటికే ప్రవీణ్‌(Pastor Praveen Kumar) కళ్లజోడు పగిలిపోయి ఉంది. కొంతమూరు పైవంతెనపై కూడా ఆయన వేగంగా వెళ్లారు. ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్‌ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఆయన బుల్లెట్‌ ను ఏ వాహనం కూడా ఢీకొనలేదు. బైక్‌ కు, పక్కన వెళ్తున్న కారుకు చాలా గ్యాప్‌ ఉంది. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కంకర రాళ్లు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్‌ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్‌ యాక్సిడెంట్‌ అని ఏలూరు డీఐజీ అశోక్‌ కుమార్‌ ప్రకటించారు.

Also Read : AP Inter Results: ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్‌

Leave A Reply

Your Email Id will not be published!