Pat Cummins : హిట్ మ్యాన్ వల్లే కొంప మునిగింది
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్
Pat Cummins : నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు లో ఘోరంగా ఓటమి పాలైంది పాట్ కమిన్స్(Pat Cummins) సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు. టాస్ గెలిచిన స్కిప్పర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం తన పాలిట , జట్టుకు శాపంగా మారుతుందని అనుకోలేదని పేర్కొన్నాడు. విచిత్రం ఏమిటంటే టాప్ ఆర్డర్ అంతా కుప్ప కూలింది.
ప్రధానంగా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా, సిరాజ్ , షమీ , అక్షర్ పటేల్ తమ వంతు పాత్ర పోషించారు. అంతే కాదు భారత్ కు ఆధిక్యం తీసుకు రావడంలో కీలకమైన పాత్ర పోషించాడు కెప్టెన్ , హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇతర ఆటగాళ్లు ఫెయిల్ అయినా రోహిత్ నిలకడగా ఆడుతూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు.
120 రన్స్ చేశాడు. అనంతరం రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, షమీ భారత్ స్కోర్ 400 పెరగడంలో దోహద పడ్డారు. ఇదే క్రమంలో తొలి ఇన్నింగ్స్ 177 రన్స్ , రెండో ఇన్నింగ్స్ లో 91 పరుగులకే చాప చుట్టేసింది ఆస్ట్రేలియా. మ్యాచ్ అనంతరం ఆసిస్ కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) మీడియాతో మాట్లాడాడు.
తాము ఓడి పోవడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మేనంటూ వాపోయాడు. అసాధరణమైన ఇన్నింగ్స్ ఆడాడని కితాబు ఇచ్చాడు. తన ఇన్నింగ్స్ తో తమను ఒత్తిడిలోకి నెట్టి వేశాడని దీంతో తాము ఓడి పోయానని పేర్కొన్నాడు ఆసిస్ స్కిప్పర్.
పనిలో పనిగా భారత జట్టు అద్భుతంగా ఆడిందని అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో వాళ్లు మా కంటే ముందున్నారని పేర్కొన్నాడు పాట్ కమిన్స్.
Also Read : టెస్టుల్లో పెరిగిన భారత్ ర్యాంక్