Pathan Break KGF2 : కేజీఎఫ్-2 రికార్డ్ పఠాన్ బ్రేక్
వసూళ్లలో బాక్సులు బద్దలు
Pathan Break KGF2 : బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ , బ్యూటీ క్వీన్ గా పేరొందిన దీపికా పదుకొనే కలిసి నటించిన పఠాన్ మూవీ దుమ్ము రేపుతోంది. గత నెల జనవరి 25న విడుదలైన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ ఎత్తున కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన ప్రతి చోటా కోట్లు కురిపిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. భారీ ఎత్తున నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు రూ. 900 కోట్లకు పైగా కొల్లగొట్టింది.
ఒక్క భారత్ లోనే రూ. 450 కోట్లు సాధించింది. సినీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పోయేలా చేసింది. ఇదిలా ఉండగా దేశ మంతటా అత్యంత ఎక్కువగా వసూళ్లు చేసిన హిందీ మూవీస్ లో పఠాన్ నిలిచింది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ -2 మూవీ రికార్డు లు(Pathan Break KGF2) క్రియేట్ చేస్తోంది.
దర్శక ధీరుడు రూపొందించిన బిగ్ మూవీ బాహుబలి రూ. 510 కోట్లతో టాప్ లో ఉండగా త్వరలోనే షారుక్ ఖాన్ పఠాన్ మూవీని బ్రేక్ చేయనుందని ఇందులో ఎలాంటి అనుమానం లేదని ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్ష్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పఠాన్ మూవీపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ప్రధానంగా ఇందులోని బేషరమ్ సాంగ్ తీవ్ర రాద్దాంతానికి దారి తీసింది. హిందూ సంస్కృతిని కించ పరిచేలా ఉందని భారతీయ జనతా పార్టీతో పాటు హిందుత్వ సంస్థలు, మంత్రులు సైతం మండిపడ్డారు.
Also Read : పఠాన్ విజయం కలెక్షన్ల వర్షం