Bill Gates Paula Hurd Comment : ‘పౌలా’ ఓలాల‌ ‘బిల్’ గిల‌గిల‌

లేటు వ‌య‌స్సులో ఘాటు ప్రేమ

Bill Gates Paula Hurd Comment :  ప్రేమ అద్బుతం. ఎప్పుడు పుడుతుందో ఇంకెప్పుడు వ‌శం చేసుకునే చేస్తుందో చెప్ప‌లేం. అది విశ్వ వ్యాప్తం. దానికి అవ‌ధులు లేవు. అంత‌క‌న్నా అడ్డంకులు లేనే లేవు. ఎల్ల‌లు ఎరుగ‌నిది ఈ ప్రేమ‌. నిరాశ‌లో ఉన్నప్పుడు..స‌ర్వం కోల్పోయిన‌ప్పుడు..లోకం వెలి వేసిన‌ప్పుడు ప్రేమ చిగురిస్తింది. మొల‌కెత్తేలా చేస్తుంది. గుండెల్లో గువ్వ‌ల రాగాల‌ను ఆలాపిస్తుంది. దీనికి వ‌య‌స్సు అడ్డంకి కాదు. చ‌రిత్రలో ఇలాంటి స‌న్నివేశాల‌కు కొద‌వ లేదు.

గ‌తంలోకి వెళితే ఎన్నో ప్రేమ క‌థ‌లు. మ‌రెన్నో మైమ‌రిపించే అద్బుత దృశ్య కావ్యాలు . కోట్లు ఉంటే ఏం లాభం. ఆకాశ హార్మ్యాలు ఉంటే..ఎవ‌రికి కావాలి. ఒక్క‌సారి భూమి కంపిస్తే మ‌న‌ద‌నుకున్న సంప‌ద క‌ళ్ల ముందే భ‌ళ్లున కుప్ప కూలుతుంది. ఎవ‌రికీ కాకుండా పోతుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఏదో ఒక రోజు ప్రేమ కావాల్సిందే. ప్రేమ లేకుండా ఉండ‌లేం. ప్రేమ అన్న‌ది మ‌న‌స్సులో మొల‌కెత్తితే వ‌య‌స్సుతో ప‌నేంటి.

అందుకేనేమో ప్ర‌పంచ కుబేరుల జాబితాలో టాప్ లో ఉన్న బిల్ గేట్స్ మ‌న‌సు పారేసుకున్నాడు. ఆపై వ‌ల‌పు పాట‌లు అందుకున్నాడు. ఎంచ‌క్కా పౌలా హ‌ర్డ్ తో ప్రేమాయ‌ణం(Bill Gates Paula Hurd)  సాగుస్తున్నాడు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. టెక్నాల‌జీ ఆధిప‌త్యం వ‌హిస్తున్న ప్ర‌స్తుత కాలంలో ప్రేమ రోజు రోజుకు ప్ర‌కాశిస్తూనే ఉంది. ఏమైందో ఏమో కానీ ఉన్న‌ట్టుండి బిల్ గేట్స్ గుండెను మీటింది పౌలా. ఇప్పుడు ఈ ఇద్ద‌రు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు.

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ జీవితంలో ఏదో కోల్పోతున్నామ‌న్న బెంగ …అంత‌కు మించిన బాధ క‌లుగుతుంది. ఒంట‌రిత‌నం శాపం. ప్ర‌పంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నా ల‌వ్ లేక పోతే లైఫ్ కు అర్థం ఏముంటుంద‌ని. అందుకే క‌వులు..ర‌చ‌యిత‌లు ల‌వ్ ఈజ్ బ్లైండ్ అన్నారు. అంటే ప్రేమ గుడ్డిదే కావ‌చ్చు..కానీ మ‌నిషికి ఆక్సిజ‌న్ లా ప‌ని చేస్తుంది. బాడీలో కొత్త చైత‌న్యాన్ని ర‌గిలిస్తుంది. అలాంటి సాంగ‌త్యాన్ని కోరుకున్నాడు బిల్ గేట్స్ . అందుకే పౌలా హ‌ర్డ్ తో క‌లిసి టెన్నిస్ మ్యాచ్ కూడా వీక్షించాడు.

మైక్రోసాఫ్ట్ కు కో ఫౌండ‌ర్ గా ఉన్నాడు. ఈ పౌలా హ‌ర్డ్ ఎవ‌రో కాదు..ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఒరాకిల్ దిగ‌వంగ‌త సిఇఓ భార్య‌. బిల్ గేట్స్ ఆగ‌స్టు 2021లో మెలిండా ఫ్రెంచ్ గేట్స్ నుండి విడాకులు తీసుకున్నాడు.

ప్ర‌స్తుతం మూడో సంప‌న్న‌మైన వ్య‌క్తిగా పేరొంద‌ని పౌలా హ‌ర్డ్ తో ల‌వ్వాయ‌ణం చేస్తుండ‌డం విస్తు పోయేలా చేసింది. పౌలా హ‌ర్డ్ విద్యాధికురాలు. దాన ధ‌ర్మాలు చేయ‌డంలో పేరొందారు. ఏకంగా $7 మిలియ‌న్ల విరాళం అంద‌జేశారు.

అంతే కాదు సాయం చేయాల‌ని కోరుతూ గివ్ లైట్ క్యాంపెయిన్ కు $1 బిలియ‌న్ మార్క్ ను చేరుకోవ‌డంలో పౌలా హర్డ్ కీల‌క పాత్ర పోషించారు. ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి. ఇక బిల్ గేట్స్ 27 ఏళ్ల త‌ర్వాత విడిపోయారు. ఏది ఏమైనా ప్రేమ క‌లిపింది ఇద్ద‌రినీ ..శాశ్వ‌తంగా ఉండాల‌నీ కోరుకుందాం.

 

Meta CEO Warning : జుక‌ర్ బ‌ర్గ్ స్ట్రాంగ్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!