Pawan Kalyan : జీఈఆర్ సర్వేపై లెక్కలు తేల్చాలి
జగన్ కు పవన్ కళ్యాణ్ సవాల్
Pawan Kalyan : కృష్ణా జిల్లా – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన జీఈఆర్ సర్వే లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.
సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అసలు వాస్తవాలు బయటకు కనిపించ నీయకుండా చూస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో 3,17,200 కుటుంబాలు బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాయని ఆవేదన చెందారు.
Pawan Kalyan Asking About GER Survey Report
3,88,000 మంది విద్యార్థులు బడులకు వెళ్లకుండా డ్రాప్ అయ్యారని పేర్కొన్నారు. అంతే కాదు 62,754 మంది పిల్లలు వివిధ కారణాలతో చని పోయారని ఇందుకు సంబంధించిన డేటా ఎక్కడుందో చెప్పాలని సవాల్ విసిరారు జగన్ మోహన్ రెడ్డికి .
ఈ వివరాలు వెళ్లడించే దమ్ము సీఎంకు ఉందా అని ప్రశ్నించారు. ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టి పోయడమే పనిగా పెట్టుకున్నారని , రాబోయే ఎన్నికల్లో ఇది నడవదన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గ్లాస్, సైకిల్ పార్టీలను ఆదరించడం ఖాయమన్నారు .
Also Read : Minister KTR : ఐటీ టవర్ తో 50 వేల మందికి ఉపాధి