Pawan Kalyan: ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ పై పవన్‌ కల్యాణ్‌ ప్రశంసల జల్లు

ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ పై పవన్‌ కల్యాణ్‌ ప్రశంసల జల్లు

Pawan Kalyan : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఉపశమనం కలిగించేలా ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక పాస్‌ల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో ఫాస్టాగ్ వార్షిక పాస్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్థానంలో దీన్నో గేమ్‌ ఛేంజర్‌గా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ఈ నిర్ణయంతో ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్‌ కు పరిష్కారం లభించినట్లవుతుందని పేర్కొన్నారు.

Pawan Kalyan Appreciates

టోల్ చెల్లింపులను సరళీకృతం చేస్తూ… ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రైవేటు వాహన యజమానులకు ఉపశమనం కలిగించేలా ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక పాస్‌లను అమలులోకి తీసుకొస్తున్నందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రూ.3వేల వార్షిక పాస్‌తో వాహనదారులకు ఆర్థిక ఉపశమనం కలగడం మాత్రమే కాదు… దేశ వ్యాప్తంగా సున్నితమైన, వేగవంతమైన, వివాద రహిత హైవే ప్రయాణం సాకారమవుతుందన్నారు. దీని ద్వారా టోల్‌ ప్లాజాల సమీపంలో నివసిస్తూ రెగ్యులర్‌గా ప్రయాణించే వారికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.  వారికి సమయంతో పాటు భారం కూడా తగ్గుతుందన్నారు.

ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక పాస్‌ లను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్‌ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ‘ఎక్స్‌’లో చేసిన పోస్టును డిప్యూటీ సీఎం కార్యాలయం రీట్వీట్‌ చేస్తూ పైవిధంగా స్పందించింది.

Also Read : Shubhanshu Shukla: మరోసారి వాయిదా పడ్డ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!