Pawan Kalyan: ఏలేరు వరద పరిస్థితిపై కాకినాడ కలెక్టర్‌ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ !

ఏలేరు వరద పరిస్థితిపై కాకినాడ కలెక్టర్‌ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ !

Pawan Kalyan: ఏలేరు వరద ఉద్ధృతిపై కాకినాడ కలెక్టర్‌, అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) సమీక్ష నిర్వహించారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్‌ కు ఫోన్ చేసి వరద పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. ఎగువున కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు. గండ్లు పడటం, రహదారులపైకి నీటి ప్రవాహం చేరటం వల్ల పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పిఠాపురం – రాపర్తి, పెద్దాపురం – గుడివాడ, సామర్లకోట – పిఠాపురం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయన్నారు. గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు వెల్లడించారు.

Pawan Kalyan Comment

వరద బారిన పడ్డ ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. ఏలేరుకి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు 12,567 క్యూసెక్కుల ఇన్ఫ్ ఫ్లో కి వచ్చేసిందని తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.16 టీఎంసీలు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

కాగా… ఏలేరు రిజర్వాయరుకు గంటగంటకూ అంచనాలకు అందనంత రీతిలో వరద పోటెత్తుతోంది. ఎగువన క్యాచ్‌మెంట్‌ ఏరియా అయిన ఏజెన్సీలో వర్షాలు భారీగా కురుస్తుండడంతో వేల క్యూసె క్కుల వరద రిజర్వాయరును ముంచెత్తుతోంది. గంటగంటకు ప్రవాహ ఉధృతి పెరిగిపోతోంది. గడిచిన నాలుగున్నరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో వరద ఏలేరును చుట్టుముడుతోంది. గతంలో 2013, 2019, 2020ల్లో ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల నుంచి 48 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయికి మించి వరద పోటెత్తుతుండంతో దిగువకు వరద నీటిని వదిలేస్తున్నారు. అయి తే ఊహించని వరద కాలువలను ముంచేస్తుండడంతో ఎక్కడికక్కడ కాలువలకు భారీగా గండ్లు పడుతున్నాయి. అనేక గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి.

Also Read : AP Government: ఏపీ ఎక్సైజ్‌ శాఖలో ‘సెబ్‌’ రద్దు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు !

Leave A Reply

Your Email Id will not be published!