Pawan Kalyan : వైసీపీ పాలనలో 219 గుళ్లపై దాడులు
పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan : వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వైసాపీ పవర్ లోకి వచ్చాక ప్రధానంగా కేవలం హిందూ దేవాలయాలను టార్గెట్ చేశారని , దాడులకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రెండో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా తణుకులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్. జగన్ సీఎంగా కొలువు తీరాక రాష్ట్రంలో 219 ఆలయాలపై దాడులు జరిగాయని, దీని వెనుక సీఎం హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
హిందువులను ఇంకెంత కాలం కించ పరుస్తారంటూ నిలదీశారు. రామతీర్థంలో శ్రీరాముని విగ్రహానికి శిరచ్చేదనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్వేదిలో రథం దగ్దం చేశారని, ఇప్పటి వరకు ఒక్క నిందితుడిని కూడా ఈ ప్రభుత్వం పట్టుకోలేక పోయిందని ఆరోపించారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఇవి చాలవన్నట్లు అన్నవరంలో అర్చకులను వేలానికి పెట్టాడంటూ ధ్వజమెత్తారు.
దేవాలయ ఆవరణలో ఉన్న షాప్స్ , ప్రసాదాల తయారీ, కళ్యాణ కట్ట వంటి వాటిని వేలం వేసుకుంటే తప్పు లేదు..కానీ అర్చకులను వేలం వేయకూడదని ఏపీ దేవాదాయ చట్టం చెబుతోందన్నారు. చివరకు చట్టాలంటే గౌరవం కూడా లేకుండా పోయిందన్నారు పవన్ కళ్యాణ్. ఇతర మతాలకు చెందిన వారిని వేలానికి వేస్తారా జగన్ అంటూ ప్రశ్నించారు.
Also Read : Telangana Tourism : శ్రీవారి..షిర్డీ భక్తులకు ఖుష్ కబర్