TSPSC Group-2 : ఓ వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మరో వైపు గ్రూప్ -4 పరీక్షను నిర్వహించింది. రికార్డు స్థాయిలో నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ -4కు దరఖాస్తు చేసుకున్నారు. ఆశించిన దానికంటే ఎక్కువ మంది పరీక్ష రాశారు. కమిషన్ చైర్మన్ ను , సభ్యులను పక్కన పెట్టింది కేసీఆర్ సర్కార్. వారిని కొనసాగిస్తూనే మరో వైపు కొత్త అధికారికి బాధ్యతలు అప్పగించింది.
తాజాగా టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఎప్పటి లాగే నిర్దేశించిన తేదీ, టైం ప్రకారం గ్రూప్ -2 పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. గ్రూప్ -2(TSPSC Group-2) పరీక్షను వచ్చే ఆగస్టు 29,30 తేదీలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పరీక్షలు జరుపుతామని పేర్కొంది టీఎస్పీఎస్సీ. రెండు సెషన్ల వారీగా ఎగ్జామ్ ఉంటుందని పేర్కొంది. వీటిని ఓఎంఆర్ పద్దతిలో నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా గ్రూప్ -2 పరీక్షకు సంబంధించి మొత్తం 783 పోస్టులు ఉన్నాయి. వీటికి 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు గ్రూప్ -3, గ్రూప్ -1 రెండు పరీక్షలను కూడా త్వరలో పూర్తి చేయాలని చైర్మన్ జనార్దన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : Pawan Kalyan : వైసీపీ పాలనలో 219 గుళ్లపై దాడులు
