Pawan Kalyan : జ‌న‌సేన జెండా బీజేపీ ఎజెండా ఒక్క‌టే

వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల‌నివ్వం

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీతో జ‌న‌సేన పొత్తుపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆయ‌న ఏపీ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ ముర‌ళీధ‌ర‌న్ తో పాటు కేంద్ర మంత్రి షెకావ‌త్ ను క‌లుసుకున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని కోరారు. లేఖ అంద‌జేశారు. ఆయ‌న వెంట నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ఉన్నారు.

ఢిల్లీ టూర్ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో జ‌న‌సేన‌, బీజేపీ అజెండా ఒక్క‌టేన‌ని స్ప‌ష్టం చేశారు. వైసీపీ వ్య‌తిరేక ఓటును చీల‌నివ్వ‌మంటూ పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. వైసీపీ నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని విముక్తం చేయ‌డ‌మే త‌మ ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. జ‌నసేన‌, బీజేపీ రెండు పార్టీల జెండాలు, ఎజెండాలు కూడా సేమ్ టు సేమ్ అని పేర్కొన‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

రెండు రోజుల హ‌స్తిన టూర్ స‌త్ఫ‌లితాలు ఇచ్చింద‌ని చెప్పారు. అంత‌కు ముందు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు. 45 నిమిషాల‌కు పైగా వివిధ అంశాల‌పై చ‌ర్చించారు.

వైసీపీ ఇలాఖాలో రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని, అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. జ‌గ‌న్ స‌ర్కార్ పోవాలంటే జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి ఉమ్మ‌డి పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan).

Also Read : లీకుల జాత‌ర ప్ర‌తిభ‌కు పాత‌ర

Leave A Reply

Your Email Id will not be published!