Pawan Kalyan : సీఎంకు తెలుగు రాక పోతే ఎలా
ప్రశ్నించిన జనసేన చీఫ్ పవన్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఆ పార్టీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన జగన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఏపీలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
నాలుగు సంవత్సరాలకు ఒకసారి భార్యలను మార్చే సంస్కృతి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ఉందంటూ సంచలన ఆరోపణలు చేసిన జగన్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు జనసేన పార్టీ చీఫ్. తెలుగు రాష్ట్రానికి తెలుగు భాష రాని ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయనకు వయోజన సంచార పాఠశాల పథకంలో తెలుగు తాను నేర్పిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్.
తనతో రోజుకు ఒక్కసారైనా తిట్టించుకోక పోతే వైసీపీ నాయకులకు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. తవ్విన కొద్దీ వైసీపీ నేతల పాడు పనులు కుప్పలు తెప్పలుగా బయట పడుతున్నాయని పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నీరుగారి పోయిందన్నారు. ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరూ ఫిర్యాదు తీసుకునేందుకు ఒప్పు కోవడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
Also Read : Bhim Army Chief Attack : భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ పై కాల్పులు