Pawan Kalyan : జనసేనకు జగ్గూ భాయ్ కి మధ్య వార్
పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కామెంట్స్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేశారు. జనసే(Janasena)నకు జగ్గూ భాయ్ కి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. గురువారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
సీఎం జగన్ రెడ్డికి కొత్త పేరు పెట్టారు అదే జగ్గూ భాయ్ అని. వాలంటీర్లే వైసీపీకి ప్రైవేట్ సైన్యం అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం తమదే అనే భ్రమల్లో జగన్ అండ్ టీం ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఆ భ్రమలను తొలగిస్తామని హెచ్చరించారు.
సాక్షి పేపర్ కోసం ప్రతి ఏటా రూ. 48 కోట్లు ప్రజా ధనాన్ని లూటీ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. అర్హత లేని జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. జగన్ కు అంత సీన్ లేదన్నారు. తాను ప్రజల కోసం , వారి తరపున ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. అవినీతి, అక్రమాలకు ఏపీ అడ్డాగా మారిందన్నారు.
అత్యంత బాధ్యతతో నిర్వహించాల్సిన పదవిని కరప్షన్ కు కేరాఫ్ గా మార్చడం దారుణమన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో ప్రజలు జగన్ పాలనతో విసిగి పోయారని , త్వరలోనే మార్పు తథ్యమని జోష్యం చెప్పారు.
Also Read : Twitter Changes : ట్విట్టర్ కీలక మార్పు