Pawan Kalyan : ఏపీలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. అరాచక పాలనను సాగనంపడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
Pawan Kalyan Slams YSRCP Govt
రాష్ట్రంలో ప్రధాన పార్టీలను, నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. వైకాపా వ్యతిరేక ఓటు చీల్చనీయనని గతంలో తాను చెప్పానని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). రాష్ట్ర అభివృద్దే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
అనుభవం కలిగిన నాయకుడు రాష్ట్రానికి అవసరమని భావించామని, అందుకే 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు జనసేన పార్టీ చీఫ్. వైసీపీ విధానాలు పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, వైసీపీ తెగులు పట్టుకుందని ఫైర్ అయ్యారు. రాజమహేంద్ర వరంలో రెండు గంటల పాటు సాగింది మీటింగ్. బీసీలు, ఎస్సీలకు రావాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేశారని ఆరోపించారు.
Also Read : Tirumala Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భక్తజనం
