Pawan Kalyan : ప్ర‌జ‌ల‌ కోసం ప్ర‌శ్నిస్తే కేసులా – జ‌న‌సేనాని

ఏపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫైర్

Pawan Kalyan : న‌టుడు, జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఏపీ ప్ర‌భుత్వం , పోలీసులు అనుస‌రిస్తున్న తీరు బాగో లేద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం ప్ర‌శ్నిస్తే కేసులు ఎలా పెడ‌తారంటూ ప్ర‌శ్నించారు. ఆదివారం ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) కు పోలీసులు నోటీసులు అంద‌జేశారు. దీంతో ప‌లు కార్య‌క్ర‌మాలు ర‌ద్దు చేసుకున్నారు.

స్వ‌యంగా అందుకోవ‌డం విశేషం. జ‌న‌సేన చీఫ్ వైజాగ్ టూర్ తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ప‌వ‌న్ తో పాటు మ‌రికొంద‌రు జ‌నసేన పార్టీ నాయ‌కుల‌కు పోలీసులు సెక్ష‌న్ 41ఎ కింద నోటీసులు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. లా అండ్ ఆర్డ‌ర్ ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని వెంట‌నే విశాఖ‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌దిలి వెళ్లాల‌ని పోలీసులు కోరారు నోటీసుల్లో.

ఇదిలా ఉండ‌గా త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై న‌మోదు చేసిన కేసులు అక్ర‌మ‌మ‌ని, వెంట‌నే వాటిని ఉప‌సంహ‌రించు కోవాల‌ని డిమాండ్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అరెస్ట్ చేసిన వారంద‌రినీ త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. పోలీసులు నోటీసులు ఇవ్వ‌డంతో గ‌త్యంత‌రం లేక త‌న కార్య‌క్ర‌మాల‌ను పూర్తిగా ర‌ద్దు చేసుకున్నారు.

చెక్కులు పంపిణీ చేయాల‌ని అనుకున్నారు. కానీ ప‌ర్మిష‌న్ లేక పోవ‌డంతో తాను ఉంటున్న హోట‌ల్ లోనే ప‌ని కానిచ్చేశారు. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఎవ‌రైనా ప్ర‌జ‌ల కోసం గొంతెత్తితే వారిపై కేసులు న‌మోదు చేయ‌డం అల‌వాటుగా మారింద‌న్నారు.

తాము వ‌చ్చాకే గొడ‌వ‌లు చెల‌రేగాయంటూ క‌ల‌రింగ్ ఇస్తున్నారంటూ మండిప‌డ్డార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌. తాము ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నామ‌ని అంత‌కు త‌ప్ప ఏమీ చేయ‌డం లేద‌న్నారు.

Also Read : డిజిట‌ల్ చెల్లింపుల‌కు టీఎస్ఆర్టీసీ శ్రీ‌కారం

Leave A Reply

Your Email Id will not be published!