Pawan Kalyan: ప్లాస్టిక్ రహిత ఏపీ మా లక్ష్యం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్లాస్టిక్ రహిత ఏపీ మా లక్ష్యం - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం ఉందని.. క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదన్నారు. కాబట్టి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. వీటి నియంత్రణకు ముందుకు రావాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన జీవితాల్లో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయిందన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో (Tirumala) ప్లాస్టిక్ నిషేధాన్ని క్రమశిక్షణతో అమలు అవుతుందని గుర్తు చేశారు. ప్లాస్టిక్ (Plastic) నియంత్రణ అనేది రాజకీయ నేతల నుంచే ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఫ్లెక్సీల వాడకం విచ్చలవిడిగా పెరిగి పోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ చిన్న కార్యక్రమం అయినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
Pawan Kalyan Key Comments
ఒక్క సారి వాడిన ప్లాస్టిక్‌ను నియంత్రించడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సచివాలయంలో ప్లాస్టిక్ ఫ్రీగా ప్రకటించామని.. దాంతో గాజు బాటిళ్లలో నీరు ఇస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ ఎకానమీలో భాగంగా పార్కులు, ప్లాస్టిక్ రీ సైకిలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. బయోడీగ్రేడబుల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సాహిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి క్రియాశీలక పాత్ర పోషించాలంటూ పౌరులకు ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు ప్లెక్సీలు పెడుతున్నాయని.. ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు పర్యవరణాన్ని కలుషితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్… భూమిలో కలవడానికి 300 ఏళ్లు పడుతుందని చెప్పారు. పశువుల కడుపులోకే కాదు… పసికందుల రక్తంలో కూడా ఇది కలిసి పోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ మైక్రో, న్యానో ప్లాస్టిక్ (Plastic) రూపంలో ఉండి పోతున్నాయని… దీనిపై రెండు మూడు నెలల్లో డీటెయిల్డ్ ప్లాన్‌తో వస్తున్నామని వివరించారు. నిర్మల్ గ్రామ పురస్కారం తరహలో ప్లాస్టిక్ రహిత గ్రామాలకు ఇన్సెంటీవ్ ఇస్తామని ప్రకటించారు. వచ్చే సెషన్‌లో పర్యావరణం, కాలుష్యంపై ప్రత్యేక చర్చ జరుగుతుందన్నారు.
ఉప్పలపాడు పక్షుల కేంద్రం విషయంలో చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ)లో ఎవరినీ నియమించలేదు. కాలుష్య నియంత్రణ స్థానిక సంస్థలతో సంబంధమున్న అంశం. పీసీబీలో ప్రత్యేకంగా ఉద్యోగులు లేరు. రాంకీ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నాం. వెంటనే చర్యలు తీసుకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. కాలుష్య నియంత్రణ బాధ్యత పరిశ్రమలదే కాదు.. ప్రజలు, అధికారులది కూడా. రాంకీపై నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వంలా కక్ష సాధింపు అనే ప్రచారం జరిగే ప్రమాదముంది. పారిశ్రామికవేత్తలను భయపెట్టడం మా ఉద్దేశం కాదు.. కూర్చోబెట్టి సమస్యను చెబుతాం. గతం ప్రభుత్వంలా ఇప్పుడు జరగదు’’ అని పవన్ అన్నారు.
సెప్టెంబర్ 22 నుంచి దసరా సెలవులు
స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో… వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి సెలవులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని ప్రకారం.. దసరా పండుగకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో దసరా పండుగకు 12 రోజులు రానున్నాయి.
కాగా, అంతకు ముందు స్కూళ్లకు దసరా పండుగ సెలవులను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 9 రోజులు ప్రకటించారు. అయితే, దీనిపై పునరాలోచించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వా్నికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి.. మరో 3 రోజులు పెంచుతూ 9 రోజుల సెలవులను కాస్తా 12 రోజులుగా ప్రకటించింది.
Also Read : YSRCP MLC: వైసీపీకు బిగ్ షాక్ ! టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు !
