Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ! తొలి సంతకం ఆ పెన్నుతోనే ?
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ! తొలి సంతకం ఆ పెన్నుతోనే ?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్(Pawan Kalyan)… పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై ఆయన తొలి సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు.
Pawan Kalyan As A..
అయితే పవన్ కళ్యాణ్ సంతకం చేసిన పెన్ను గురించి చర్చకు దారితీసింది. ఇటీవల పవన్(Pawan Kalyan) వదిన సురేఖ ఖరీదైన పెన్ను బహుమతిగా అందజేశారు. ఓ అభిమాని కూడా పెన్ను గిప్ట్‌గా ఇచ్చారు. దీనితో ఆయన ఏ పెన్ను వాడారు ? ఏ పెన్నుతో అధికారిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. విజయవాడ సూర్యారావుపేటలో గల నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లో ఉన్న క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. తన శాఖలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేసి ఛార్జ్ తీసుకున్నారు. ఆ సమయంలో అభిమాని ఇచ్చిన ఎక్స్‌వో పెన్ను ఉపయోగించారు. నిన్న పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి అమరావతి వస్తోండగా ఆయనకు రైతులు అడుగడుగునా నీరాజనం పలికారు ఓ అభిమాని పెన్ను బహుకరించారు. ఆ పెన్నును జాగ్రత్తగా ఉంచుకొని, ఈ రోజు సంతకం చేశారు. ఈ పెన్ను విలువ తక్కువే… రూ.10కి మార్కెట్‌లో పెన్ను లభిస్తోంది. వదిన ఇచ్చిన రూ. లక్షల పెన్ను కాదని అభిమాని ఇచ్చిన పెన్నుతో పదవి బాధ్యతలను పవన్ కళ్యాణ్ స్వీకరించారు.
పవన్ కళ్యాణ్ సింపుల్ గా ఉంటారు. ఆడంబరాలు అంటే నచ్చవు. అందుకే అభిమాని ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు. ఫ్యాన్స్ పవన్ ఎంత అభిమానిస్తారో.. పవన్ కూడా అదే స్థాయిలో వారికి ప్రయారిటీ ఇస్తారని దీనిని బట్టి అర్థం అవుతోంది. దీనితో పవన్ కళ్యాణ్ పై మరోసారి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
Also Read : Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి !