Pawan Kalyan : పోలవరంపై వైసీపీ సర్కార్ శీతకన్ను
కేంద్ర మంత్రికి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు
Pawan Kalyan Polavaram : జనసేన పార్టీ చీఫ్, నటుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా గడిపారు. దేశ రాజధాని హస్తినలో బీజేపీ ఏపీ ఇంఛార్జి , కేంద్ర మంత్రి మురళీధరన్ ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.
రాష్ట్రం అభివృద్ది కోసం కేంద్ర సర్కార్ తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి షెకావత్ ను కలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మేరకు ఓ సుదీర్ఘ లేఖ కూడా ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయని, రాష్ట్రంలో కొలువు తీరిన జగన్ రెడ్డి సర్కార్ పట్టించు కోవడం లేదంటూ ఆరోపించారు. వెంటనే కేంద్రం నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan Polavaram) ప్రస్తావించిన పోలవరం పై ఫోకస్ పెడతామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
జన సేనాని వెంట పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.2019 మే నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతానికి పైగా పూర్తయితే గత నాలుగు సంవత్సరాల కాలంలో 3 శాతం పనులు కూడా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
Also Read : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు – రావెల