Varahi Vijaya Yatra : ముగిసిన వారాహి విజ‌య యాత్ర‌

ఏపీ స‌ర్కార్ పై జ‌న‌సేన పార్టీ చీఫ్ ఫైర్

Varahi Vijaya Yatra : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన వారాహి విజ‌య యాత్ర ఎట్ట‌కేల‌కు ముగిసింది. ఈ సంద‌ర్బంగా జ‌న‌సేనాని వైసీపీ ప్ర‌భుత్వంపై, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల అరాచక‌ల‌పై ఎక్కువ‌గా ప్ర‌శ్నించారు. నిల‌దీశారు. ఆపై వ్య‌క్తిగ‌తంగా కూడా స‌వాళ్లు కూడా విసిరారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తొలి ద‌శ యాత్ర‌లో వైసీపీ స‌ర్కార్ చేస్తున్న ఆగ‌డాలు, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు ప‌వ‌ర్ స్టార్.

వివిధ సంఘాల ప్ర‌తినిధులు, లాయ‌ర్లు, మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, వ్యాపార‌వేత్త‌ల‌ను క‌లుసుకున్నారు. వారి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. వారిచ్చిన స‌మ‌స్య‌ల‌ను నోట్ చేసుకున్నారు ప‌వ‌న్ కళ్యాణ్. ఈ సంద‌ర్బంగా జ‌న‌సేన(Janasena ) పార్టీకి ఒక్క‌సారి ఛాన్స్ ఇవ్వాల‌ని కోరారు. తాము గ‌నుక ప‌వ‌ర్ లోకి వ‌స్తే సంక్షేమ రాజ్యాన్ని తీసుకు వ‌స్తామ‌న్నారు. మెరుగైన పాల‌న అంద‌జేస్తామ‌ని చెప్పారు.

దళితుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు, నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కావాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. విద్యార్థుల‌కు చ‌దువుకునేలా ఏర్పాట్లు చేస్తామ‌ని, రైతుల‌కు సాయం, గిట్టు బాటు ధ‌ర క‌ల్పిస్తామ‌న్నారు. ప‌ట్టు ప‌రిశ్ర‌మ‌ల కార్మికుల‌ను ఆదుకుంటామ‌న్నారు. క‌నీస వ‌స‌తులు లేని ఆస్ప‌త్రుల‌ను బాగు చేస్తామ‌ని చెప్పారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం కృషి చేస్తామ‌ని తెలిపారు. అధ్వాన్నంగా మారిన రోడ్లను మారుస్తామ‌న్నారు. చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌, కాకినాడ‌ను గంజాబ్ నుంచి ర‌క్షిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Anil Kumar Yadav : అభ్య‌ర్థుల ఓట‌మికి నారాయ‌ణ డ‌బ్బులు

Leave A Reply

Your Email Id will not be published!