Rahul Gandhi Sabha : రేపే కాంగ్రెస్ జ‌న గ‌ర్జ‌న స‌భ

రానున్న అగ్ర నేత రాహుల్ గాంధీ

Rahul Gandhi Sabha : కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జూలై 2న ఆదివారం జ‌న గ‌ర్జ‌న స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది. ఇప్ప‌టికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియ‌ర్ నాయ‌కులు ఖ‌మ్మంలో కొలువు తీరారు. ఇటీవ‌లే ఇదే జిల్లాకు సంబంధించి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణార‌వు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రో వైపు ఆదిలాబాద్ జిల్లా నుండి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేప‌ట్టారు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

ఈ యాత్ర నేటితో ముగియ‌నుంది. దారి పొడ‌వునా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుండి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో కొలువు తీరిన అధికార బీఆర్ఎస్ పార్టీ తీరుపై ,విధానాల‌పై నిప్పులు చెరిగారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

కాగా పీపుల్స్ మార్చ్ ముగింపు సంద‌ర్బంగా న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో బ‌హిరంగ స‌భ‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది కాంగ్రెస్ పార్టీ. కాగా త‌న స‌త్తా ఏమిటో రాహుల్ గాంధీకి(Rahul Gandhi) చూపించాల‌ని డిసైడ్ అయ్యారు మాజీ ఎంపీ పొంగులేటి. ఈ భారీ స‌భ‌కు జ‌న గ‌ర్జ‌న స‌భ అని పేరు పెట్టారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హాజ‌రు కానున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.

Also Read : Varahi Vijaya Yatra : ముగిసిన వారాహి విజ‌య యాత్ర‌

 

Leave A Reply

Your Email Id will not be published!