PM Modi : దేశాభివృద్దిలో స‌హ‌కార రంగం కీల‌కం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

PM Modi : దేశ అభివృద్దిలో స‌హ‌కార రంగం అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). శ‌నివారం ఢిల్లీలో 17వ స‌హ‌కార కాంగ్రెస్ ను ప్ర‌ధాని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌హ‌కార రంగం ఏర్పాటు వ‌ల్ల ల‌క్ష‌లాది మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతోంద‌ని చెప్పారు. ఇవాళ డెయిరీ రంగంపైనే అత్య‌ధిక ఆదాయం స‌మ‌కూరుతోంద‌న్నారు.

అంతే కాదు కోట్లాది మంది చిన్న రైతులు మ‌ధ్య‌వ‌ర్తులు (ద‌ళారీలు) లేకుండా పీఎం కిసాన్ ప‌థ‌కం కింద ప్ర‌యోజ‌నాలు పొందుతున్నార‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో ఈ ఒక్క స్కీం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల‌కు రూ. 2.5 లక్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను బ‌దిలీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు న‌రేంద్ర మోదీ. దేశ ప్ర‌గ‌తిలో ఈ రంగం శ‌క్తివంత‌మైన పాత్ర పోషిస్తోంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఇప్పుడు ర‌సాయ‌న ర‌హిత, స‌హ‌జ సాగుకు ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని తెలిపారు.

గ‌త కొంత కాలంగా రైతు ఉత్ప‌త్తి సంస్థ‌లు లేదా ఎఫ్పీఓల ఏర్పాటుపై ఎక్కువ‌గా దృష్టి పెట్టింద‌న్నారు. 10,000 వేల దాకా ఏర్పాటైన‌ట్లు తెలిపారు మోదీ. ఒక్కో దానికి బ్లాకుగా ఏర్పాటు చేశామ‌న్నారు. రైతులు పండించిన పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. దీని వ‌ల్ల మ‌ధ్య ద‌ళారీల బెడ‌ద ఉండ‌ద‌న్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

Also Read : Rahul Gandhi Sabha : రేపే కాంగ్రెస్ జ‌న గ‌ర్జ‌న స‌భ

 

Leave A Reply

Your Email Id will not be published!