Pawan Kalyan: శనివారం కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ !

శనివారం కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టుకు రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఇప్పటికే అనకాపల్లిలోని శ్రీ నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్… శనివారం తెలంగాణాలోని కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు… ఆ వాహనానికి తొలిపూజ కొండగట్టులోనే నిర్వహించారు.

Pawan Kalyan Visit

కూటమి పొత్తులను పవన్ కళ్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పవన్ సెక్యూరిటీ అధికారులు కొండగట్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్ మార్గంలో కొండగట్టుకు పవన్ చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసారు. పవన్ సెక్యూరిటీ స్పెషల్ అడ్వైజర్ కల్నల్ అర్జున్ రూట్ మ్యాప్, పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కు భారీ స్వాగత ఏర్పాట్లు నిర్వహించనున్నారు.

Also Read : Telangana Congress: చివరి దశకు ‘టీపీసీసీ’ కసరత్తు !

Leave A Reply

Your Email Id will not be published!