Pawan Khera Slams : నా స్వేచ్ఛను హరించారు – ఖేరా
విమానంలోంచి దించేశారంటూ ఆరోపణ
Pawan Khera Slams : ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి పవన్ ఖేరాను అరెస్ట్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఇదే సమయంలో ఖేరా రాయ్ పూర్ కు వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు.
ఆయన విమానంలోకి ఎక్కిన తర్వాత సామాను తనిఖీ చేయాల్సి ఉందంటూ కిందకు దించారు. ఇదే విషయాన్ని పవన్ ఖేరా వెల్లడించారు. తన వద్ద ఎలాంటి సామాను లేదని చెప్పానని తెలిపారు. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ పవన్ ఖేరా (Pawan Khera) ఆరోపించారు.
ఫ్లైట్ ఎక్కిన కొద్ది క్షణాల తర్వాత బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ ఢిల్లీ నుండి ఇండిగో విమానం నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిందని మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ లోనే ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అయితే ఉదయం పవన్ ఖేరాను ఇండిగో విమానంలో రాయ్ పూర్ కు తీసుకు వెళ్లారంటూ తెలిపారు. తనను విమానంలో నుంచి ఛత్తీస్ గఢ్ కు దింపే ప్రయత్నంలో అధికారులు తనకు అబద్దాలు చెప్పారని , నిబంధనలను , తన వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు(Pawan Khera Slams). తనను డీసీపీ కలుస్తారని చెప్పారు కానీ తన నుంచి ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదని మరి ఎందుకు ఆపారంటూ ప్రశ్నించారు పవన్ ఖేరా.
Also Read : బీజేపీ వన్ మ్యాన్ షోగా మారింది