Payyavula Keshav: మాజీ సీఎం జగన్ పై ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు !

మాజీ సీఎం జగన్ పై ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు !

Payyavula Keshav: ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. శాఖల కేటాయింపు అనంతరం శుక్రవారం పయ్యావుల కేశవ్ ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ప్రతిపక్ష హోదాపై పలు ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. శాసనసభకు జగన్ రావాలని కోరుకుంటున్నానని, గతంలో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్‌ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలని ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.

Payyavula Keshav Slams

చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నప్పుడే ఆయనలో నిజమైన స్ఫూర్తి బయటకు వస్తుందని కేశవ్(Payyavula Keshav) అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసి చంద్రబాబు ఒక్కరినే అసెంబ్లీలో ఉంచారని ఆయన గుర్తుచేశారు. అప్పుడే చంద్రబాబులో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంచిందో తాము ఇంకా చూడాల్సి ఉందన్నారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో నిధుల మళ్లింపు, భవిష్యత్ ఆదాయం తాకట్టు వంటి అనేక అవకతవకలు జరిగాయని పయ్యావుల కేశవ్ అన్నారు. కాగ్ కూడా ఈ మేరకు నివేదిక ఇచ్చిందని, , సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. సంపద సృష్టి పేరుతో పన్నులు వేసేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బ్రాండ్‌ తో పరిశ్రమలు, ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువస్తామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Also Read : Telangana Government: 24 లక్షల తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి పంపించిన తెలంగాణా ప్రభుత్వం !

Leave A Reply

Your Email Id will not be published!