Mickey Arthur : పాక్ క్రికెట్ జట్టుకు డైరెక్టర్ గా ఆర్థర్
ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
Mickey Arthur : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక ప్రకటన చేసింది. ప్రముఖ మాజీ క్రికెటర్ మిక్కీ ఆర్థర్(Mickey Arthur) ను తమ పురుషుల జట్టుకు డైరెక్టర్ గా నియమించినట్లు వెల్లడించింది. మిక్కీ ఆర్థర్ 2016 నుండి 2019 వరకు పాకిస్తాన్ కు కోచ్ గా ఉన్నాడు.
టెస్టులు, టి20లలో పాకిస్తాన్ ను టాప్ లోకి తీసుకు వెళ్లేలా చేశాడు. ఈ ఏడాది చివర్లో భారత్ లో జరగనున్న 50 ఓవర్ల ప్రపంచ కప్ సన్నాహాల్లో మిక్కీ ఆర్థర్ ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది.
పాకిస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్ గా విశిష్ట సేవలు అందించాడు. ప్రధానంగా పాకిస్తాన్ క్రికెటర్లు ఆయనను తమ గురువుగా భావిస్తారు. అంతలా ఆర్థర్ వారితో కలిసి పోయాడు. పాక్ ఆటగాళ్లలో మానసిక స్థైర్యాన్ని నింపడంలో కీల పాత్ర పోషించాడు. ఇక మిక్కీ ఆర్థర్(Mickey Arthur) వయస్సు 54 ఏళ్లు. పురుషుల జట్టు కోసం వ్యూహాల రూపకల్పన, సూత్రీకరణ, పర్యవేక్షణలో పాల్గొంటాడు.
మిక్కీ ఆర్థర్ ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ , ఆస్ట్రేలియా టూర్ , విండీస్ తో స్వదేశీ సీరీస్ ల కోచింగ్ స్టాఫ్ లో భాగం అవుతాడని , ఏసీసీ ఆసియా కప్ లో భారత్ తో జరిగే పాకిస్తాన్ మ్యాచ్ లకు కూడా ఆర్థర్ జట్టుతో ఉంటాడని పీసీబీ వెల్లడించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తిరిగి చేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు మిక్కీ ఆర్థర్. ఆ జట్టుతో కలిసి పని చేసేందుకు తాను ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
Also Read : కేఎల్ రాహుల్ కు జరిమానా