PCB Shock To Sri Lanka : శ్రీలంకకు పాకిస్తాన్ బిగ్ షాక్
బీసీసీఐతో దోస్తీపై గుస్సా
PCB Shock To Sri Lanka : దాయాది పాకిస్తాన్ తీరు మారడం లేదు. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీటి ప్రభావం ఇరు దేశాల క్రికెట్ కు సంబంధించిన జట్లపై ప్రభావం పడుతోంది. తాజాగా ఆసియా కప్ 2023 వివాదం బీసీసీఐ, పీసీబీ(PCB) మధ్య ముదిరింది. ఆసియా కప్ ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉండగా శాంతి , భద్రతల దృష్ట్యా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) దానిని రద్దు చేసింది. చివరకు శ్రీలంకకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. లేదా తటస్థ వేదికపై నిర్వహించేందుకు మొగ్గు చూపింది.
బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జే షా ఏసీసీ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నాడు. దీంతో అటు పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ నిప్పులు చెరిగాడు షా పై. చివరకు ఐసీసీలో సైతం ఫిర్యాదు చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు యావత్ ప్రపంచ క్రికెట్ ఆటను బీసీసీఐ నియంత్రిస్తోంది. దానిని కాదని ఏ జట్టు ఇప్పుడు స్వతంత్రంగా మన గలిగే స్థితిలో లేదు. ఇదిలా ఉండగా ఇటీవలి సమావేశంలో శ్రీలంక(Sri lanka) క్రికెట్ బోర్డు బీసీసీఐకి మద్దతు ఇవ్వడాన్ని పీసీబీ తప్పు పట్టింది.
చివరకు శ్రీలంకతో పాకిస్తాన్ ఆడే సీరీస్ ను తాము ఆడబోమంటూ ప్రకటించింది. చివరకు పైత్యం పరాకాష్టకు చేరుకుంటే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది పాక్. ఒకవేళ ఆడక పోతే నష్టం బీసీసీఐకి కాదు పీసీబీకేనంటూ స్పష్టం చేశారు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. మొత్తంగా మరోసారి పీసీబీ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
Also Read : Sonia Gandhi