Tejashwi Yadav : యూపీలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకం
డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్
Tejashwi Yadav : యూపీలోని బీజేపీ సర్కార్ పాలనలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav ). సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ, గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను పోలీసుల సమక్షంలోనే ముగ్గురు షూటర్లు దారుణంగా కాల్చి చంపారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మాఫియానే లేకుండా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం యోగి ఆదిత్యానాథ్.
ఇక అతిక్ అహ్మద్ తన నేర సామ్రాజ్యాన్ని అంతకంతకూ విస్తరించుకుంటూ పోయాడు. ఆయనను పెంచి పోషించింది సమాజ్ వాది పార్టీ, బీఎస్పీలు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకసారి ఎంపీగా గెలుపొందాడు. కానీ ఆయనపై విచారణ చేపట్టకుండా 10 మంది జడ్జీలు తప్పుకున్నారంటే ఎంత పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ అనేది అర్థం కాక తప్పదు. అయితే వీటిని , ఆయన నేరాలను, చేసిన హత్యల గురించి ప్రతిపక్షాలు మాట్లాడటం లేదు. కానీ హత్య జరగడం తప్పదని అంటున్నాయి. వారిలో ఎంఐఎం చీఫ్ ఓవైసీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సీరియస్ కామెంట్స్ చేశారు.
వీరి జాబితాలో తాజాగా తేజస్వి యాదవ్ కూడా చేరి పోయారు. యూపీలో మాత్రం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం యోగి తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలియ చేస్తున్నారు. మరో వైపు హత్య ఘటన జరిగిన తర్వాత 15 మంది పోలీసులను సస్పెండ్ చేశారు సీఎం. నేరాన్ని నిర్మూలించడం అంటే నేరస్థులను చంపడం కాదు . న్యాయ స్థానం ఉందన్న విషయం తెలుసు కోవాలన్నారు తేజస్వి యాదవ్(Tejashwi Yadav) .
Also Read : గ్యాంగ్ స్టర్ల హత్య జర్నలిస్టులకు భద్రత