ముంబై : ఎంతో ఉత్కంఠకు తెర దించుతూ బుచ్చిబాబు సన ఎట్టకేలకు ఫ్యాన్స్ కు కిర్రాక్ తెప్పించేలా రామ్ చరణ్ , జాన్వీ కపూర్ కలిసి నటించిన పెద్ది మూవీ ట్రైలర్ వచ్చేసింది. మరోసారి తనదైన మార్క్ ను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కెరీర్ పరంగా చూస్తే తనకు ఇది రెండో సినిమా. గతంలో ఉప్పెన తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో తొలిసారిగా విజయ్ సేతుపతిని విలన్ గా చూపించాడు. ఇక తాజాగా పెద్దిలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ను కీ రోల్ లో పోషించేలా చేశాడు. మొత్తంగా మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు లివింగ్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ అందించాడు. అంతకు ముందు శంకర్ దర్శకత్వం వహించిన రామ్ చరణ్ తేజ నటించిన మూవీకి సంగీతం ఇచ్చాడు. ఆ మూవీ బొక్క బోర్లా పడింది. నిర్మాతకు భారీ నష్టాలను చేకూర్చి పెట్టింది. కానీ పెద్ది సినిమాకు అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. మ్యూజిక్ చార్ట్స్ లలో టాప్ లో కొనసాగుతున్నాయి ఈ పాటలు.
ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ , జాన్వీ కపూర్ నటించిన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది సినిమా ట్రైలర్ను ముంబైలో జరిగిన ఒక భారీ విడుదల కార్యక్రమంలో ఆవిష్కరించారు. రామ్ చరణ్ అభిమానులు ఇప్పుడు దాని కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ రగ్గడ్ అవతార్ , యాక్షన్-ప్యాక్డ్ స్పోర్ట్స్ డ్రామా అయిన పెద్ది కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు అభిమానులు. పెద్ది చిత్ర నిర్మాతలు ఇప్పుడు జియో వరల్డ్ డ్రైవ్లో ట్రైలర్ను ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీలు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాపై ఒక ముఖ్యమైన అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
