Pegasus Case : జూన్ 20 లోగా పెగాస‌స్ రిపోర్ట్ ఇవ్వాలి

స్ప‌ష్టం చేసిన సుప్రీంకోర్టు

Pegasus Case : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పెగాస‌స్ వ్య‌వ‌హారానికి సంబంధించిన కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ మేర‌కు కేసుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది సుప్రీంకోర్టు.

పూర్తి నివేదిక‌ను వ‌చ్చే జూన్ నెల 20వ తేదీ లోగా ద‌ర్యాప్తు క‌మిటీ స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం పెగాస‌స్ స్పై వేర్ సాంకేతిక‌ను ఉప‌యోగించింద‌ని, త‌మ ర‌హ‌స్యాల‌ను, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఇది రికార్డు చేస్తోందంటూ విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆరోపించాయి.

రెండు సార్లు పార్ల‌మెంట్ లోని ఉభ‌య స‌భ‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ మేర‌కు సుప్రీంకోర్టులో ప‌లు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి పెగాస‌స్(Pegasus Case) వ్య‌వ‌హారంపై నిగ్గు తేల్చాల‌ని కోరాయి.

దీనిపై భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల పాటి వెంక‌ట ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం పెగాస‌స్ పై విచార‌ణ‌కు స్వీక‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

భార‌త దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు, ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగానికి ఇది అత్యంత ప్రమాద‌క‌రంగా మారిందంటూ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఈ మేర‌కు పెగాసస్(Pegasus Case) వ్య‌వహారంపై ప్ర‌త్యేకంగా ద‌ర్యాప్తు క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పూర్తి స్థాయి నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. కాగా ద‌ర్యాప్తు క‌మిటీ త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించడంలో ఆల‌స్యం చేసింది.

దీంతో శుక్ర‌వారం పెగాస‌స్ కేసుకు సంబంధించి ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఈ మేర‌కు ద‌ర్యాప్తు క‌మిటీని జూన్ 20 లోపు స‌మ‌ర్పించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ పెగాస‌స్ స్పైవేర్ సాంకేతిక‌త ఇజ్రాయెల్ కు చెందిన కంపెనీ కావ‌డంతో పెద్ద దుమారం రేగింది.

Also Read : లొంగిపోయేందుకు సిద్దూ నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!