PM Modi : నాపై బురద చల్లితే జనం నమ్మరు – మోదీ
కాంగ్రెస్, ఆప్ పార్టీల ఆరోపణలపై ఆగ్రహం
PM Modi : తనను అప్రతిష్టపాలు చేసేందుకు, నాపై బురద చల్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా కాంట్రాక్టు తీసుకుందని సంచలన ఆరోపణలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అయినా ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని జోష్యం చెప్పారు. తనకు దేశం , అభివృద్ది ముఖ్యమన్నారు.
వాళ్లు అభివృద్దికి ఆటంకం కలిగించడం తప్ప ఇంకేమీ చేయరని ఎద్దేవా చేశారు మోదీ. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న తమకు వారి ఆశీర్వాదం ఎల్లప్పుడు తమకే ఉంటుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి(PM Modi).
ఇదిలా ఉండగా గుజరాత్ లో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆప్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొలువు తీరిన బీజేపీని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ తరుణంలో మంగళవారం గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లా జమ్ కందోర్నా పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పాల్గొని ప్రసంగించారు.
తనను దుర్బాసలాడటం మానేసి మౌనంగా పని చేసుకుంటూ పోతున్న కాంగ్రెస్ గురించి బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులు పని చేయాలని హెచ్చరించారు. గత 20 ఏళ్లలో గుజరాత్ కు వ్యతిరేకంగా ఉన్న వారు రాష్ట్ర పరువు తీసేందుకు నానా రకాలుగా రాళ్లు వేస్తూ వచ్చారని ఆరోపించారు మోదీ.
Also Read : మోదీ మౌనం దేశానికి ప్రమాదం