Perni Nani: అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని ?

అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని ?

Perni Nani : రప్పా రప్పా అని చెప్పడం కాదు… రాత్రికి రాత్రి చేసేయాలంటూ.. పామర్రులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై (Perni Nani) రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. జనసేన, టీడీపీ నాయకులు ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో పామర్రు కేసును కొట్టివేయాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు పేర్ని నాని విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని… హై కోర్టును ఆశ్రయించారు. అయితే పేర్ని నానికి హైకోర్టులో చుక్కెదురైంది. పేర్నినాని ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీనితో పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసారు.

Perni Nani Absconding

అయితే హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీనితో పేర్ని నాని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేసారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని అరెస్ట్ పై వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 22న హైకోర్టు విచారణ తరువాత పేర్ని నాని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

జులై 8న పామర్రులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రప్పా రప్పా అంటూ కొట్టిన డైలాగులు ఇంకా ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రప్పా రప్పా అని చెప్పడం కాదు.. రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Also Read : CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!