Perni Nani : బెయిల్ క‌ష్టం జైలు శాశ్వ‌తం

మాజీ మంత్రి పేర్ని నాని

Perni Nani : తాడేప‌ల్లి గూడెం – మాజీ మంత్రి పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఊచ‌లు లెక్క పెడుతున్న రిమాండ్ ఖైదీ నారా చంద్ర‌బాబు నాయుడు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా బెయిల్ రాద‌న్నారు.

Perni Nani Shocking Comments on Chandrababu

త‌న 45 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో మొత్తం త‌ను దోచు కోవ‌డానికి , త‌న వారికి దోచి పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేశాడ‌ని ఆరోపించారు. ఎవ‌రైనా న్యాయం కోసం, ధ‌ర్మం కోసం ఆందోళ‌న‌లు చేప‌డతార‌ని కానీ టీడీపీ నేత‌లు, శ్రేణులు విచిత్రంగా అవినీతి, అక్ర‌మాలు చేసి జైలు పాలైన చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

ప‌క్కా ఆధారాల‌తోనే ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంద‌న్నారు. చివ‌ర‌కు హైకోర్టు కూడా కేసు కొట్టి వేసింద‌న్నారు. తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్క‌డ కూడా నిరాశ‌కు గురి కావ‌డం త‌ప్ప‌ద‌న్నారు పేర్ని నాని(Perni Nani).

అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కుతుంద‌న్నారు. నారాయ‌ణ విద్యా సంస్థ‌లు ఏ మేర‌కు దోచుకుంటున్నాయో ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసన్నారు. ఏపీలో తాము కొలువు తీరాక టీడీపీ హ‌యాంలో జ‌రిగిన వాటిని వెలికి తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని , ఇందులో దిగ్భాంత్రిక‌ర వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయ‌న్నారు.

Also Read : Supriya Shrinate : బ‌డా బాబుల‌కు మోదీ స‌పోర్ట్

Leave A Reply

Your Email Id will not be published!