Perni Nani : ప్యాకేజీ పవన్ కు అంత సీన్ లేదు – నాని
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
Perni Nani : ఏపీలో మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చెప్పులు చూపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పవన్ కళ్యాణ్ కు చెందిన చెప్పులు కొట్టేశానంటూ ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. తను పార్టీ ఎందుకు పెట్టాడో , ఎవరి కోసం పెట్టాడో ఇప్పటి వరకు చెప్పలేదన్నారు.
మతి తప్పి, గతి తప్పి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కు అంత సీన్ లేదన్నారు. ఇప్పటికే జన సేన పార్టీ చీఫ్ కు ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అన్న మరో పేరు కూడా ఉందని , ఆ విషయం గుర్తు పెట్టుకుంటే చాలన్నారు. గతంలో పవన్ కు తగిన రీతిలో బుద్ది చెప్పారని, ఈసారి అంతకంటే ఎక్కువగా కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు పేర్ని నాని(Perni Nani).
ఎవరు ఏమిటో త్వరలోనే తేలుతుందన్నారు మాజీ మంత్రి. నన్ను విమర్శించినంత మాత్రాన, లేదా చెప్పుల దండలు వేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదన్నారు. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని ఎద్దేవా చేశారు. జన సైనికులుగా భావిస్తున్న వారికి తాను ఒక్కటే చెప్ప దల్చుకున్నానని దమ్ముంటే బహిరంగంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు పేర్ని నాని.
ఆరు నూరైనా ఏపీ సీఎంగా మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడని, అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. తల కిందులు చేసినా తాను మాత్రం గెలవడని జోష్యం చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని.
Also Read : Umar Ahmad Ganie Comment : నిన్న పెయింటర్ నేడు టాపర్