Perumal Murugan Rahul Yatra : పెరుమాళ్ కు రాహుల్ థ్యాంక్స్

మురుగ‌న్ కు ధ‌న్యావాదాలు

Perumal Murugan Rahul Yatra : అఖండ భార‌త దేశం కోసం త‌న‌తో పాటు న‌డిచినందుకు ప్ర‌ముఖ ర‌చ‌యిత పెరుమాళ్ మురుగన్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో న‌టి ఊర్మిళాతో పాటు పెరుమాళ్ మురుగ‌న్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌మ్యూనిటీల మ‌ధ్య వంతెన‌లు నిర్మించాల‌నే మీ తిరుగులేని నిబ‌ద్ద‌త స్పూర్తి దాయ‌క‌మ‌ని కొనియాడారు రాహుల్ గాంధీ.

దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాల‌ని కోరుతూ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు 3,500 కిలోమీట‌ర్ల‌కు పైగా పూర్త‌యింది. ప్ర‌స్తుతం క‌ల్లోలంగా మారిన జ‌మ్మూ కాశ్మీర్ లో కొన‌సాగుతోంది పాద‌యాత్ర‌. ప్ర‌స్తుతం దిగ్గ‌జ ర‌చ‌యిత పెరుమాళ్ మురుగ‌న్ రాహుల్ గాంధీ(Perumal Murugan Rahul Yatra)తో క‌లిసి న‌డ‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, మేధావులు , ఇత‌ర ప్ర‌ముఖులు సైతం పాద‌యాత్ర‌లో పాలు పంచుకున్నారు. ఇంత‌కీ ఎవ‌రీ పెరుమాళ్ మురుగన్ అనేది చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఇంత‌కీ ఎవ‌రు పెరుమాళ్ మురుగ‌న్ అనుకుంటున్నారా..మోస్ట్ పాపుల‌ర్ ర‌చ‌యిత‌గా గుర్తింపు పొందారు. త‌మిళ భాష‌లోని అత్యుత్త‌మ ర‌చ‌యిత‌ల‌లో ఒక‌రు.

2015లో మిత‌వాద స‌మూహాల‌తో వేధింపుల‌కు, దాడికి గురైన త‌ర్వాత త‌న ర‌చ‌న చ‌ని పోయిన‌ట్లు ప్ర‌క‌టించారు. విశ్వ విద్యాల‌యంలో జాబ్ వ‌దిలేశారు. ప్ర‌వాసంలోకి వెళ్లారు. త‌న ఫేస్ బుక్ పేజీలో ఇలా రాశారు. పెరుమాళ్ మురుగ‌న్ ర‌చ‌యిత మ‌ర‌ణించాడ‌ని ప్ర‌క‌టించాడు. ఇది సంచ‌ల‌నంగా మారింది. ఇవాళ మ‌రోసారి ఈ ర‌చ‌యిత హాట్ టాపిక్ గా మారారు.

Also Read : రాహుల్ యాత్ర‌కు జ‌నం జేజేలు

Leave A Reply

Your Email Id will not be published!