Peshawar University Dance : పాక్ యూనివర్శిటీలో వల్గర్ డ్యాన్స్
సోషల్ మీడియాలో వీడియో వైరల్
Peshawar University Dance : టెక్నాలజీ మారుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సెల్ ఫోన్లు వినియోగంలోకి వచ్చాక ఎవరు ఎలా కన్నేసి ఉంచుతున్నారో తెలియడం లేదు. దీంతో బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు యువతులు, మహిళలు. తాజాగా పూర్తి కట్టుదిట్టంగా ఉండే పాకిస్తాన్ లో తాజాగా ఓ సింగర్ అసభ్యకరమైన డ్యాన్స్(Peshawar University Dance) చేయడం కలకలం రేపింది.
అది విద్యార్థులు చదువుకునే ప్రతిష్టాత్మకమైన కేఎంయూ యూనివర్శిటీలో చోటు చేసుకోవడం మరింత చర్చకు దారి తీసింది. ప్రముఖ సింగర్ పాట పాడుతూ హాఫ్ డ్రెస్ తో దర్శనం ఇవ్వడం, అక్కడ స్టూడెంట్స్ ఎంజాయ్ చేయడం తో అది వైరల్ గా మారింది. దీంతో పాకిస్తాన్ యూనివర్శిటీ వైరల్ డ్యాన్స్ వీడియోపై ఇన్ స్టిట్యూట్ కి నోటీసు జారీ చేసింది.
తన వైఖరిని మూడు రోజుల్లోగా వివరించాలని కోరింది. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఎన్సీఎస్ యూనివర్శిటీ సిస్టమ్ డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. ఇక జారీ చేసిన నోటీసులో అనైతికం అని పేర్కొంది. చదువుకునే సంస్థల్లో ఇలాంటివి ఎలా అనుమతి ఇచ్చారని పేర్కొంది.
ఎన్సీఎస్ యూనివర్శిటీ ప్రాంగణంలో మూడు రోజుల హునార్ మేళా ముగింపులో ఈ కార్యక్రమం జరిగిందని పాకిస్తాన్ కు చెందిన పత్రిక డాన్ తెలిపింది. బిగుతుగా అమర్చిన దుస్తులు ధరించి ఉన్న అమ్మాయి పాటలు పాడటం వైరల్ గా మారంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
అక్టోబర్ 20న ఎన్సీసీకి అనుబంధంగా ఉన్న కేఎంయూ కాలేజీ ఫంక్షన్ లో ఒక యువతి చేసిన డ్యాన్స్ కు సంబంధించి నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
Also Read : నటి జాక్వెలిన్ కు బెయిల్ పొడిగింపు