Ashish Mishra : ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
లఖింపూరి ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడు
Ashish Mishra : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలోని లఖింపూరి ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది అలహాబాద్ కోర్టు.
దీంతో ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. ఆశిష్ మిశ్రాకు (Ashish Mishra)బెయిల్ మంజూరు చేయడంపై రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ తో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీలు తీవ్రంగా తప్పు పట్టాయి.
ఈ దేశంలో అసలు న్యాయం అన్నది లేదన్నది స్పష్టమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు తికాయత్. ఇదే సమయంలో ఆశిష్ మిశ్రా(Ashish Mishra) బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా పిటీషన్లు దాఖలు చస్త్రశారు. నిందితుడు బెయిల్ పై ఉంటే సాక్ష్యాలను తారు మారు చేస్తాడని తెలిపారు. ఇప్పటికే ఆయన వెనుక కేంద్ర సర్కార్ ప్రమేయం ఉందని ఆరోపించారు.
తండ్రి హోం శాఖ సహాయ మంత్రిగా ఉండడం వల్ల మరింత రెచ్చి పోయే ప్రమాదం ఉందని తెలిపారు పిటిషన్ లో. కేసు విచారణ జరుపుతున్న సిట్ వెంటనే స్టేటస్ రిపోర్ట కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు.
సిట్ కేసును సరిగా నివేదించక పోవడం వల్లనే ఆశిష్ మిశ్రాకు బెయిల్ దొరికిందని న్యాయవాదులు ఆరోపించారు. ప్రధాన నిందితుడు దర్జాగా బయట తిరుగుతున్నాడని, బాధిత కుటుంబాలు భయంతో ఆందోళనకు గురవుతున్నాయని వాపోయారు.
కాగా గత ఏడాది అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read : మోదీజీ ఆర్థిక నేరగాళ్లపై చర్యలేవి