#PetrolDiesel : మళ్లీ పెట్రో, డీజల్ ధరలపై వడ్డింపు – ఈ వారంలో రెండోసారి
Petrol and diesel prices on the rise again - for the second time this week
Petrol Diesel : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు స్వల్పంగా పెరిగిన కారణాలని చూపి గత కొంత కాలంగా దేశీ ఇంధన ధరలు పెంచుకుంటూ లాభాలందుకుంటున్న ప్రెట్రో కంపెనీలు తాజాగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.02 శాతం పెరుగుదలతో 55.75 డాలర్లకు , డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.23 శాతం పెరుగుదలతో 52.75 డాలర్లకు చేరటంతో ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను కంపెనీలు పెంచేసాయి.
ఈ వారంలో సోమవారం ఇంధన ధరలు పెరిగిన విషయం మరచిపోక ముందే మరోమారు బుధవారం కూడా పెట్రోల్ ధర 26 పైసలు, డీజిల్ ధర 27 పైసలు చొప్పున పెంచేసాయి. హైదరాబాద్లో బుధవారం పెట్రోల్ ధర రూ.89.77కు, డీజిల్ ధర రూ.83.46కు చేరగా, అటు ఏపి రాజధాని అమరావతిలో పెట్రోల్ ధర రూ.92.54కు , డీజిల్ ధర రూ.85.73కు పెరిగాయి అలాగే ఇక విజయవాడలోనూ పెట్రోల్ ధర రూ.92.07కు రూ.85.29కు ఎగసింది.
No comment allowed please