PFI BAN : పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై బ్యాన్

అయిదు సంవ‌త్స‌రాల పాటు నిషేధం

PFI BAN : దేశంలో గ‌త కొంత కాలంగా విద్వేషాల‌ను సృష్టిస్తూ, వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతూ అల్ల‌క‌ల్లోలానికి కార‌ణ‌మ‌వుతున్న కేర‌ళ‌కు చెందిన పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్రంలోని మోదీ బీజేపీ సంకీర్ణ స‌ర్కార్.

ఉగ్ర‌వాద సంస్థ‌లు, టెర్ర‌రిర‌స్టులు, సానుభూతిప‌రులకు పీఎఫ్ఐ నిధులు(PFI BAN) స‌మ‌కూరుస్తోంద‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేంద్రం ఆరోపించింది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా రెండు సార్లు ఎన్ఐఏ, ఈడీ, ఐటీ, సీబీఐ విస్తృతంగా దాడులు చేప‌ట్టింది.

వారం రోజుల కింద‌ట జ‌రిపిన దాడుల్లో పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన 106 మందిని అరెస్ట్ చేసింది. తాజాగా మంగ‌ళ‌వారం జ‌రిపిన దాడుల్లో 300 మందిని అదుపులోకి తీసుకుంది. క‌రాటే శిక్ష‌ణ పేరుతో యువ‌కుల‌ను చేర‌దీసి ఉగ్ర‌వాదులుగా మారుస్తోందంటూ కేంద్రం ఆరోపించింది.

దీనిపై ప‌లుమార్లు కీల‌క మీటింగ్ నిర్వ‌హించింది. ఇందులో కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ పాల్గొన్నారు.

ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు నిధులు స‌మ‌కూర్చుతున్న‌ద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పాపుల‌ర్ ఆఫ్ ఇండియా పై ఐదు సంవ‌త్స‌రాల పాటు నిషేధం విధించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఓ వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖుల‌ను హ‌త్య చేసేందుకు పీఎఫ్ఐ ప్లాన్ చేసింద‌ని ఆరోపించింది. పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన రిహ‌బ్ ఇండి ఫౌండేష‌న్ , క్యాంప‌స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ , నేష‌న‌ల్ కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ హ్యూమ‌న్ రైట్స్ ఆర్గ‌నైజేష‌న్ , నేష‌న‌ల్ ఉమెన్స్ ఫ్రంట్ , జూనియ‌ర్ ఫ్రంట్ , ఎంప‌వ‌ర్ ఇండియా ఫౌండేష‌న్ పై ఐదేళ్ల పాటు వేటు వేసింది కేంద్రం.

Also Read : స‌చిన్..గెహ్లాట్ ఇద్ద‌రూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్

Leave A Reply

Your Email Id will not be published!