Kerala PFI Bandh : కేరళలో పీఎఫ్ఐ బంద్ ఉద్రిక్తం
రాష్ట్రంలో పలు బస్సులపై దాడి
Kerala PFI Bandh : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఈడీ దాడులు చేసి 100 మందికి పైగా కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకుంది. దీనిని నిరసిస్తూ పీఎఫ్ఐ శుక్రవారం కేరళ రాష్ట్రంలో 12 గంటల పాటు బంద్(Kerala PFI Bandh) కు పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా పలు చోట్ల రాష్ట్రానికి చెందిన బస్సులపై దాడికి దిగారు. అలువా సమీపంలోని కంపెనీపాడిలో బస్సును ధ్వంసం చేశారు దుండగులు. ఇవాళ తెల్లవారుజామున నుంచే బంద్ ప్రారంభమైంది.
సాయంత్రం వరకు కొనసాగుతుందని పీఎఫ్ఐ ప్రకటించింది. చాలా ప్రాంతాలలో రాళ్ల దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇస్లామిక్ సంస్థ గా పేరుంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. తమపై దాడులు చేయడం, అరెస్ట్ లకు దిగడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తిరువనంతపురంలో వాహనాలపై దాడి చేయడాన్ని ఖండించారు. కేరళ ఆర్టీసీ మాత్రం యధావిధిగా బస్సులు నడుపుతామని ప్రకటించింది.
అవసరమైతే ఆస్పత్రులు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లకు ప్రత్యేక సేవలు అందజేస్తామని కేరళ సర్కార్ వెల్లడించింది. ఈడీ దాడుల్లో టెర్రర్ ఫండింగ్ కేసుకు సంబంధించి దాడి జరిగింది.
అరెస్ట్ అయిన వారిలో పీఎఫ్ఐ జాతీయ చైర్మన్ ఓఎంఏ సలాం, జాతీయ కార్యదర్శి నసరుద్దీనీ్ ఎలమరం, కేరళ చీఫ్ సీపీ మహమ్మద్ బషీర్ ఉన్నారు.
ఇదిలా ఉండగా పీఎఫ్ఐ కార్యకలాపాలపై కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ లో హోం శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు.
Also Read : కాంగ్రెస్ జెండాలు..బ్యానర్లపై కోర్టు ఫైర్